అన్వేషించండి

Ullozhukku OTT: చుట్టూ నీరు, ఇంట్లో శవం - కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ullozhukku OTT: పార్వతీ, ఊర్వశీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. థియేటర్లలో సూపర్ హిట్ టాక్ అందుకొని ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు దీని గురించి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

Ullozhukku OTT Release Date: గత కొన్నాళ్లుగా మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. పైగా ఈ సినిమాలు చాలావరకు కేరళ సాంప్రదాయాలను, అక్కడి పరిస్థితులను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేసే విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు అదే కేటగిరిలో మరో సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. అదే ‘ఉల్లోరుక్కు’. ఈ సినిమాలో కేరళలలో వరదలు వచ్చినప్పుడు స్థానికుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది స్పష్టంగా చూపించారు. దాని చుట్టూనే కథను నడిపించి ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేశాడు దర్శకుడు క్రిస్టో టోమి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.

కథ..

‘ఉల్లోరుక్కు’ కథ విషయానికొస్తే.. అంజు (పార్వతీ).. రాజీవ్ (అర్జున్ రాధాకృష్ణన్) అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ రాజీవ్‌కు సరైన ఉద్యోగం ఉండకపోవడంతో వేరే దారిలేక థామస్‌ కుట్టీ (ప్రశాంత్ మురళీ)ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత రాజీవ్‌ను అనుకోకుండా కలుస్తుంది అంజు. ఆ తర్వాత తరచుగా కలుస్తూనే ఉంటుంది. ఇద్దరూ మళ్లీ చాలా దగ్గరవుతారు. అప్పటికే థామస్ కుట్టీకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. మెల్లగా ఆ ట్యూమర్ వల్ల అతడి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా ఒకరోజు హాస్పిటల్‌లోనే థామస్ మరణిస్తాడు. అప్పటికే అంజు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. కానీ అది రాజీవ్ వల్ల అని తనకు మాత్రమే తెలుసు.

అంజు కడుపులో పెరుగుతుంది థామస్ కుట్టీ వారసుడు అనుకొని తన తల్లి లీలమ్మ (ఊర్వశి) చాలా సంతోషిస్తుంది. కోడలిని చాలా బాగా చూసుకోవాలని అనుకుంటుంది. కానీ అంజు మాత్రం ఎవ్వరితో నిజం చెప్పలేక తనలో తానే బాధపడుతుంది. థామస్ కుట్టీ మరణించిన తర్వాత తన అంత్యక్రియలు చేయడానికి కేరళలోని వాతావరణ పరిస్థితులు సహకరించవు. వరదల వల్ల ఊరంతా మునిగిపోతుంది. ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చేస్తాయి. ఆ నీళ్లలో శవాన్ని పూడ్చడం కష్టమని అందరూ ఆగుతారు. కానీ అంజు మాత్రం అక్కడ ఉండలేక రాజీవ్‌తో వెళ్లిపోదామని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన కథ.

డిఫరెంట్ పాయింట్..

కేరళలో తరచుగా వరదలు రావడం, దానివల్ల ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసి ప్రజలంతా ఇబ్బందిపడడం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ‘ఉల్లోరుక్కు’ లాంటి ఒక ఎమోషనల్ డ్రామా సినిమాలో వరదలకు సంబంధించిన అంశాన్ని తీసుకోవడం, దాని వల్ల ఒక వ్యక్తి అంత్యక్రియలు ఆగిపోయి.. కథ మలుపులు తిరగడం అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో పార్వతీ, ఊర్వశీ పాత్రలు మాత్రమే ఎక్కువగా తెరపైకి కనిపిస్తాయి. వీరిద్దరికి ఉన్న అనుభవంతో, యాక్టింగ్ టాలెంట్‌తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. దర్శకుడైన క్రిస్టో టామీ ఒక సెన్సిటివ్ కథను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు. ఇది తన మొదటి సినిమా అంటే నమ్మడం కొంచెం కష్టమే. మనసుకు హత్తుకునే ఎమోషనల్ డ్రామా చూడాలనుకునేవారు 'అమెజాన్ ప్రైమ్‌'లో ఉన్న ‘ఉల్లోరుక్కు’ను చూసేయండి.

Also Read: వరుడికి తాళి కట్టే వధువు, డబ్బు కోసం వేశ్యగా మారే యువకుడు - ఓటీటీలో దుమ్ములేపుతోన్న అడల్ట్ మూవీ

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
Crime Thriller Series OTT : అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా రొమాంటిక్ మూవీ - తెలుగుతో పాటు 19 భాషల్లో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా రొమాంటిక్ మూవీ - తెలుగుతో పాటు 19 భాషల్లో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
RJ Mitte Passed Away: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget