అన్వేషించండి

Bhamakalapam 2: ‘భామాకలాపం 2’ టీజర్ వచ్చేసింది, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ - థియేటర్లలో కాదండోయ్!

Bhamakalapam 2 Release Date: ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’. 2022లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘భామా కలాపం 2’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Bhamakalapam 2: సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భామా కలాపం’. 2022లో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కూడా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని కలిగించింది.

ఆకట్టుకుంటున్న‘భామా కలాపం 2’ టీజర్

తాజాగా ‘భామా కలాపం 2’ నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. “అను మనం వదిలి వెళ్తున్నది మన పాత ఇంటినే కాదు, నువ్ చేసిన తప్పుల్ని. ఇవేవి కూడా మళ్లీ నా లైఫ్ లోకి తీసుకురానని మాటివ్వు” అనే డైలాగ్ తో ఈ టీజర్ షురూ అవుతుంది. “అనుపమ అనే నేను.. పక్కనవాళ్ల విషయాల్లో తలదూర్చనని, నా పని నేను చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని మాట ఇస్తున్నాను” అంటూ ప్రియమణి చెప్తుంది. అయినప్పటికీ, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న ప్రియమణి మళ్లీ ఓ హత్య వ్యవహారంలో ఇరుక్కుంటుంది. అందులో నుంచి ఎలా బయటపడిందో తెలుసుకోవాలంటే ‘భామా కలాపం 2’ చూడాల్సిందే! ఈ సినిమా కూడా క్రైమ్, కామెడీ నేపథ్యంలో కొనసాగుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

‘భామా కలాపం 2’ విడుదల ఎప్పుడంటే?

ఇక ‘భామా కలాపం 2’ సినిమా విడుదలకు సంబంధించి అప్ డేట్ కూడా రివీల్ చేసింది ‘ఆహా’ ఓటీటీ సంస్థ. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న తమ ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు  ప్రకటించింది. ‘భామాకలాపం 2’లో సీరత్ కపూర్, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆహా’ ఓటీటీ సంస్థతో కలిసి డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్‌ ఈదార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

కరోనా సమయంలో విడుదలైన ‘భామా కలాపం’

అటు ప్రియమణి నటించిన ‘భామ కలాపం’ సినిమా కరోనా సమయంలో ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. ఈ సినిమాను అభిమన్యు తెరకెక్కించారు. అప్పట్లో ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇందులో ప్రియమణి అనుపమ మోహన్ అనే యూట్యూబర్ గా నటించింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఆమెకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వింత అలవాటు ఆమెను ఓ హత్య కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. దాని నుంచి ఆమె బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌గా కొన‌సాగుతూ ఆకట్టుకుంది. ఈ సినిమా ఏకంగా నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని సత్తా చాటింది.

Read Also: ‘సరిపోదా శనివారం’ రైట్స్ ఆ ఓటీటీకే, రికార్డు ధరకు కొనుగోలు!

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kamal Haasan Movies OTT : కమల్ హాసన్ మూవీస్‌కు బిగ్గెస్ట్ డిజిటల్ డీల్! - సెట్స్‌పై ఉండగానే ఒకే ఓటీటీకి ఆ మూడు సినిమాల రైట్స్
కమల్ హాసన్ మూవీస్‌కు బిగ్గెస్ట్ డిజిటల్ డీల్! - సెట్స్‌పై ఉండగానే ఒకే ఓటీటీకి ఆ మూడు సినిమాల రైట్స్
Sigma Movie OTT : ఓటీటీలోకి సీఎం విజయ్ కొడుకు కొత్త మూవీ - సందీప్ కిషన్ యాక్షన్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సీఎం విజయ్ కొడుకు కొత్త మూవీ - సందీప్ కిషన్ యాక్షన్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget