అన్వేషించండి

New Movies OTT: ఈ రోజు ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు... సింగం ఎగైన్ to మెకానిక్ రాకీ - ఆ రెండూ మిస్ కావద్దు

New Movies On OTT: ఈ రోజు నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఫహాద్ ఫాజిల్ కొత్త మలయాళ క్రైమ్ థ్రిల్లర్, అజయ్ దేవగన్ ‘సింగమ్ ఎగైన్‘ , విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ ’ సినిమాలను అస్సలు మిస్ కాకండి!

ఈరోజు ఓటీటీల్లో ఏయే సినిమాలు.. ఏయే ప్లాట్​ఫార్మ్​లలో వస్తున్నాయంటే.. 

ఓటీటీలో విశ్వక్ సేన్ కొత్త సినిమా

హీరో విశ్వక్ సేన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, సునీల్, హైపర్ ఆది ప్రధాన పాత్రలు పోషించారు. బీటెక్  డ్రాపౌట్ మెకానిక్ రాకీ(విశ్వక్ సేన్) జీవితంలోకి అతని మాజీ లవర్ ప్రియ మరో సారి ఎంట్రీ ఇస్తుంది. వారిద్దరి మధ్య లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ప్రియ రాకతో రాకీ లైఫ్ మరింత స్పీడ్ అందుకుంటుంది. అతనికి ఊహించని మలుపులూ ఎదురవుతాయి. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీకి రవితేజ ముళ్ల పూడి దర్శకుడు. సెకాండాఫ్ లో ఉన్న స్టఫ్, ఫస్టాఫ్ లో లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు.  గత నవంబర్ 22 న విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసింది.

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

 మర్డర్ మిస్టరీ థ్రిల్లర్... బోగన్ విల్లా

 ‘పుష్ప 2’ తో పాన్ ఇండియా లెవెల్ లో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పేరు రీసౌండ్ అవుతోంది. ఆయన నటించిన తాజాగా మలయాళ సినిమా ఓటీటీలోకి విడుదల అయింది. ‘భీష్మ పర్వమ్’ ఫేమ్ అమల్ నీరద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బోగన్ విల్లా’ ఇటీవలే థియేటర్లలో విడుదలై యావరేజ్  గా నిలిచింది. ‘బోగన్ విల్లా’ సినిమాలో ఫహాద్ ఓ మర్డర్ మిస్టరీలను ఛేదించే పోలీస్ గా నటించారు. ‘నాయట్టు’ ఫేమ్ కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రల్లో నటించిన డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ: సోనీ లివ్

హరికథ చూసేయండి

సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్  సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన ‘సేనాపతి’ అనే ఆహా వెబ్ సిరీస్ లో నటించారు. తాజాగా  నటించిన కొత్త వెబ్ సిరీస్ ఓటీటీలోకి విడుదలైంది. రంగస్థల నాటక కళాకారునిగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు మ్యాగీ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. నేరాలు చేస్తున్న వారిని చంపే ఓ కిల్లర్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. విష్ణు మూర్తి అవతారల్లో ఈ కిల్లర్ నేరస్థులను చంపుతూ ఉంటాడు. ఈ హంతకుణ్ణి వేటాడే పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ రామ్ నటించారు. డిసెంబర్ 13 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ : డిస్నీ హాట్ స్టార్

మన కథ... మలయాళంలో

మన సినిమా మలయాళంలో రీమేక్ కావడంతో చాలా అరుదు. దర్శకుడు వెంకటేశ్ మహా కొత్త వాళ్లతో తీసిన ఓ చిన్న సినిమా ‘కేరాఫ్ కంచర్ల పాలెం’. నాలుగేళ్ల క్రితం విడుదలై, పెద్ద విజయం సాధించింది. తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ అయింది కూడా. సామాన్య ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు పొందిన ఈ సినిమా తాజాగా మలయాళంలో రీమేక్ అయింది. ‘కథ ఇన్నువరె’ గా తెరకెక్కిన ఈ సినిమా లో ‘అయ్యప్పన్ కోషియమ్’ ఫేమ్ బిజూ మీనన్, నిఖిలా విమల్ ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు మోహన్ దర్శకుడు. డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ: మనోరమ మ్యాక్స్

సింగమ్ ఎగైన్

అజయ్ దేవగన్ హిట్ సిరీస్ లోని తాజా సినిమా ‘సింగమ్ ఎగైన్’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. సూర్య హీరోగా తెరకెక్కిన ‘సింగం’ సిరీస్ ను అజయ్ దేవగన్ తో 2010లో తెరకెక్కించారు రోహిత్ శెట్టి. సినిమా సూపర్ హిట్ కావడంతో పూర్తిగా వేరే కథతో ‘సింగమ్  రిటర్న్స్’ అనే సీక్వెల్ తీశారు. బాక్సాఫీస్ వద్ద ఆడలేదు ఈ సినిమా. ఈ సిరీస్ లో మూడో సినిమానే ‘సింగమ్ ఎగైన్’. హీరోయిన్ గా కరీనా కపూర్ నటించారు. అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్,  జాకీ ష్రాఫ్ లు తళుక్కున మెరిసినా ఈ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం డిసెంబర్ 13 నుంచి  రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది.  

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

Also Read : వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller Series OTT : హాస్పిటల్ రూమ్ నెంబర్ 7లో ఏముంది? - మరింత భయపెట్టే 'రాతిరి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
హాస్పిటల్ రూమ్ నెంబర్ 7లో ఏముంది? - మరింత భయపెట్టే 'రాతిరి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bhogi OTT : ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Psychological Thriller OTT : చిన్నారి మిస్సింగ్ వెనుక మిస్టరీ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న కొత్త మూవీ
చిన్నారి మిస్సింగ్ వెనుక మిస్టరీ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న కొత్త మూవీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Embed widget