అన్వేషించండి
Advertisement
Nithya Menen Singing Performance: ''నేను ఊహించలేదు'' నిత్యా మీనన్‌పై చిరంజీవి ప్రశంసల జల్లు
నిత్యామీనన్ సింగింగ్ పెర్ఫార్మన్స్ చూసిన మెగాస్టార్ చిరంజీవి మెస్మరైజ్ అయిపోయారు.
'ఆహా'లో ప్రసారమవుతోన్న ఇండియన్ ఐడల్ షో చివరి దశకు చేరుకుంది. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, కథానాయిక నిత్యా మీనన్, గాయకుడు కార్తీక్ ఈ రియాలిటీ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో సెమీ ఫైనల్స్ కి బాలకృష్ణను గెస్ట్ గా తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఆహాలో ప్రసరవుతోంది. ఇక ఫైనల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా విచ్చేశారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు, ప్రోమోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇండియా ఐడల్ ఫైనల్స్ ఎపిసోడ్ ని రేపటినుంచి(జూన్17) ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఎపిసోడ్ లో నిత్యామీనన్ ఓ పాటను పాడారు. ఈ ప్రోమోను కాసేపటి క్రితం విడుదల చేశారు. 'యువ' సినిమాలో సంకురాత్రి కోడి అనే పాటను పాడారు నిత్యామీనన్.
ఆమె పెర్ఫార్మన్స్ చూసిన మెగాస్టార్ చిరంజీవి మెస్మరైజ్ అయిపోయారు. 'ఫెంటాస్టిక్.. నేను ఊహించలేదు. నీ వాయిస్ లో మాధుర్యం, కిక్ చాలా బాగుంది' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. నిత్యా పాడినంత సేపు ఎంజాయ్ చేసిన చిరు ఆ తరువాత లేచి మరీ చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిత్యా మంచి నటి మాత్రమే కాదు.. సింగర్ కూడా. తను నటించిన సినిమాల్లో కూడా పాటలు పాడింది. అందుకే ఆమెని ఇండియా ఐడల్ షోకి జడ్జిగా తీసుకున్నారు.
Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement