అన్వేషించండి

Animal OTT: రాత్రికి రెడీగా ఉండండి, ‘యానిమల్’పై నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ పోస్ట్ - స్ట్రీమింగ్‌పై ఆసక్తికర అప్డేట్

Animal OTT Release: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ మూవీ ఫైనల్‌గా ఓటీటీ రిలీజ్ సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఒక స్పెషల్ పోస్ట్‌తో షేర్ చేసుకుంది.

Animal On Netflix: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీని ఓటీటీలో చూడడానికి ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని ఎప్పుడో అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. కానీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై మాత్రం సరిగా క్లారిటీ లేదు. మధ్యలో సినిమా కో ప్రొడ్యూసర్స్ అయిన Cine1 స్టూడియోస్‌తో మేకర్స్‌కు అయిన లీగల్‌గా ఇబ్బందులు ఎదురవ్వడంతో ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. ఇంతలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్.. ఒక క్లారిటీ ఇచ్చేసింది.

మరో 8 నిమిషాలు..

సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ‘యానిమల్’ మూవీ 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదలయ్యింది. అయితే అందులో తనకు ఇష్టం లేకపోయినా కొన్ని సీన్స్‌ను కట్ చేశానని, ఆ సీన్స్‌ను ఓటీటీ రిలీజ్‌లో యాడ్ చేశానని సందీప్ ముందే అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు. ఇక ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవ్వడంతో మరో 8 నిమిషాలను కూడా దీనికి జతచేశారట. అంటే ఇప్పుడు పూర్తిగా 3 గంటల 29 నిమిషాలు ఉన్న ‘యానిమల్’ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది. జనవరి 26 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్’ స్ట్రీమ్ అవుతుందని స్పెషల్ పోస్ట్ ద్వారా అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్ టీమ్.

సిద్ధంగా ఉండండి..

‘‘గాలి దట్టంగా మారింది. టెంపరేచర్ పెరిగిపోతోంది. యానిమల్‌లో తన క్రూరత్వాన్ని చూడండి. జనవరి 26 నుండి హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది’’ అంటూ నెట్‌ఫ్లిక్స్ టీమ్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. దాంతో పాటు సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను కూడా అటాచ్ చేసింది. దీంతో ‘యానిమల్’ మూవీ లవర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అప్పుడే ‘యానిమల్ ఆన్ నెట్‌ఫ్లిక్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండ్ మొదలుపెట్టారు. రణబీర్ కపూర్‌ను మరోసారి ‘యానిమల్’ లుక్‌లో చూడడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

యాక్టర్లు అందరికీ ప్రాధాన్యత..

ప్రపంచవ్యాప్తంగా ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 915 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటించగా తనకు జోడీగా రష్మిక మందనా కనిపించింది. మరొక ముఖ్య పాత్రలో హీరోయిన్ తృప్తి దిమ్రీ అలరించింది. హీరోయిన్‌గా ‘యానిమల్’తో రష్మికకు ఎంత గుర్తింపు వచ్చిందో.. అంతకంటే ఎక్కువ పాపులారిటీ తృప్తికి దక్కింది. ఈ ఒక్క సినిమాతో తృప్తి.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. ఇక వీరితో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. స్క్రీన్‌పై కనిపించిన ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ.. యాక్టర్లకు మంచి హిట్‌ను అందించాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాకు విమర్శలు ఎదురైనా కూడా తాను మాత్రం అందరికీ సమాధానం ఇస్తూ 2024లోనే అతిపెద్ద హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మరోసారి టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా సందీప్ రెడ్డి వంగా అనే పేరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

Also Read: రామ్ చరణ్ నన్ను కొట్టారు - RAM మూవీ హీరో సూర్య వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Main Vaapas Aaunga OTT : ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన లవ్ ఎమోషనల్ డ్రామా... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన లవ్ ఎమోషనల్ డ్రామా... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Hrudayam Murali OTT : ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ - ఓటీటీలోకి తమన్ రీసెంట్ మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ - ఓటీటీలోకి తమన్ రీసెంట్ మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
Embed widget