The Indrani Mukerjea Story Buried Truth: డాక్యుమెంటరీగా షీనాబోరా మర్డర్ కేసు, నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్, ఎప్పటి నుంచి అంటే?
షీనా బోరా హత్య కేసుకు సంబంధించి డాక్యుమెంటరీ సిరీస్ ను తెరకెక్కించింది నెట్ ఫ్లిక్స్. ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్’ పేరుతో రూపొందిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేసింది.
The Indrani Mukerjea Story Buried Truth: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసులలో షీనా బోరా హత్య కేసు ఒకటి. 2012లో షీనా బోరా హత్యకు గురికాగా, ఈ విషయం 2015లో వెలుగులోకి వచ్చింది. సొంత తల్లే బిడ్డను చంపిందని తెలుసుకునే దేశ వ్యాప్తంగా ప్రజలు షాక్ కు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ ఆరున్నర సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించింది. 2022 మేలో జైలు నుంచి బయటకు వచ్చింది. ఇప్పటికే జాలీ ఆంటీ కేసు నెట్ ఫిక్స్‌లో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్’ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తుందని భావిస్తున్నారు.
‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్’ స్ట్రీమింగ్ డేట్ రిలీజ్
షీనా బోరా హత్య కేసును బేస్ చేసుకుని నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుకెంటరీ సిరీస్ ను రూపొందిస్తోంది. ఈ సిరీస్ లో షీనా బోరా మర్డర్ తో పాటు ఇంద్రాణీ ముఖర్జీ పెళ్లిళ్లు, విడాకులు, జైలు జీవితాన్ని కంప్లీట్ గా చూపించబోతున్నారు. 2015లో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుకు సంబంధించి ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్’ పేరుతో డ్యాకుమెంటరీని రూపొందిస్తోంది నెట్ ఫ్లిక్స్. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. దాంతో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసింది.
View this post on Instagram
ఇంతకీ షీనా బోరా కేసు ఏంటంటే?
2015లో షీనాబోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కన్నతల్లే కూతుర్ని చంపేసిందన్న నిజం తెలిసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. 2012, ఏప్రిల్ లో 24 ఏళ్ల షీనా బోరాను తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె అప్పటి డ్రైవర్ శ్యాంవర్, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి గొంతుకోసి చంపారు. ఆ తర్వాత రాయ్‌గఢ్ జిల్లాలోని అడవిలో షీనా బోరా డెడ్ బాడీని కాల్చివేశారు. ఈ కేసు విషయం 2015లో బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్లు జైలులో ఉన్నారు. ఈ డ్యాకుమెంటరీ ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో షానా లెవీ, ఉరాజ్ బహల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీలకు బోలెడు వ్యూస్
ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఇలాంటి సంచలన కేసులకు సంబంధించిన పలు డాక్యుమెంటరీ సిరీస్ లను రూపొందించింది. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. నెట్‌ఫ్లిక్స్ నుంచే వచ్చిన ‘బ్యాడ్ బాయ్ బిలియనీయర్స్’, ‘హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్’, ‘కర్రీ అండ్ సైనైడ్’, ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ లాంటి క్రైమ్ డ్యాకుమెంటరీలకు నెట్ ఫ్లిక్స్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ అందుకున్నాయి. వీటి సరసన ఇప్పుడు ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్’ చేరే అవకాశం కనిపిస్తోంది.
Read Also: చీర, జాకెట్‌లో అల్లు అర్జున్, ‘ఫుష్ప 2’ నుంచి ఫోటో లీక్, షాక్‌లో మేకర్స్