IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Netflix: ఇకపై నెట్‌ఫ్లిక్స్‌లో భారతీయ మహిళల విజయగాథలు, స్వాతంత్ర్య పోరాట ఘట్టాలు

నెట్‌ఫ్లిక్స్‌లో ఇకపై భారతీయ మహిళల విజయగాథలు, స్వాతంత్ర్యపోరాట ఘట్టాలు కనిపించనున్నాయి. సినీ ప్రేమికుల కోసం ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ ప్లాన్ చేస్తోందీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌.

FOLLOW US: 

నెట్‌ఫ్లిక్స్‌(Netflix), కేంద్రం కలిసి ఓ సరికొత్త వేదిక సిద్ధం చేశాయి. ఇన్నాళ్లు వెబ్‌సిరీస్‌(Web Series), సినిమాల(Cinema)కే పరిమితమైన ఓటీటీ(OTT) ప్లాట్‌ఫామ్‌లో ఇకపై విజయగాథలు వినిపించనున్నాయి. ఆగస్టు నుంచి ఈ వీడియోలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతాయి. 

విజయగాథలకు వేదిక

వివిధ రంగాల్లో చాలా మంది మహిళలు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకొని వాళ్లు ఆ విజయాలు సాధించారు. అలాంటి వారిని విజయగాథలు ప్రపంచానికి తెలిసేలా ఓ వీడియో సిరీస్ రూపొందించింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యంతో దీనికి సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. 

దేశవ్యాప్తంగా ఉన్న చిత్ర నిర్మాతల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి ఓ సృజనాత్మక ఎకో సిస్టమ్‌  డెవలప్ చేసినట్టు అవతుందని అన్నారు ఐఅండ్‌బీ మినిస్టర్‌ అనురాగ్ ఠాకూర్. ప్రస్తుతం మార్చి 12 నుంచి నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృతోత్సవ్‌ కార్యక్రమాన్ని మరింత విస్తృత పరుస్తున్నట్టు చెప్పారు అనురాగ్‌ ఠాకూర్‌. దీనికి ఆజాదీ కా అమృత్‌ కహానీయా(Azadi Ki Amrit Kahaniya) పేరుతో దీన్ని తీసుకొస్తున్నారు. 

మూడు వీడియోలు లాంచ్

ముందు మూడు వీడియోలను లాంచ్‌ చేశార. అందులో పద్మా అవార్డు బసంతీ దేవి ఒకరు. కోసి నదిని రక్షించేందుకు ఆమె చేసిన కృషిని తెలియజేస్తూ వీడియో ఉంటుంది. 2017లో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్షు జంసెన్పా, భారతదేశపు మొదటి మహిళా అగ్నిమాపక సిబ్బంది హర్షిణి కన్హేకర్ విజయాలను తెలియజేస్తూ వీడియోలు ప్రదర్శించారు. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టీవీ హెడ్ బేలా బజారియాతో పాటు ముగ్గురు మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అన్ని భాషల్లో వీడియోలు

మంగళవారం విడుదల చేసిన మూడు వీడియోలతో సహా ఏడు వీడియోలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, దూరదర్శన్‌లో చూడవచ్చు. అవి గుజరాతీ, మరాఠీ, తెలుగు, బెంగాలీ, తమిళం, ఇంగ్లీష్, మలయాళతో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాటికి నెట్‌ఫ్లిక్స్ దాదాపు 30 వీడియోలను విడుదల చేయనుంది. ఇది మహిళల జీవితాలను మార్చిన అసాధారణమైన వారి గాథలు తెలియజేస్తుంది. 

'స్వాతంత్య్ర  పోరాటం'పై కూడా వీడియోలు 
స్వాతంత్య్ర పోరాటంపై మరిన్ని విషయాలను ప్రజలకు తెలియజేసేలా I&B మంత్రిత్వ శాఖ, నెట్‌ఫ్లిక్స్ కలిసి మరో ప్రోగ్రామ్ లాంచ్ చేయనున్నారు. స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను ప్రపంచానికి చెప్పవలసిన అంశాలపై వీడియో సిరీస్‌ రెడీ అవుతుందని తెలిపారు ఐఅండ్‌ బీ సెక్రటరీ అపూర్వ చంద్ర .

మంత్రిత్వ శాఖ, ఈ నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫారమ్ మధ్య భాగస్వామ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా చలనచిత్ర నిర్మాతల కోసం (వర్చువల్, వ్యక్తిగతంగా) శిక్షణా కార్యక్రమాలను కూడా అభివృద్ధి చేస్తుంది. మార్చిలో మహిళల కోసం వర్చువల్ స్క్రిప్ట్ రైటింగ్ ప్రోగ్రామ్‌ను నెట్‌ఫ్లిక్స్, I&B మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌లు, మాస్టర్‌క్లాస్‌లు, ఫిల్మ్ స్క్రీనింగ్‌లు, షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్‌లను కూడా చేపట్టే ప్లాన్స్ చేస్తున్నారు. 

పోస్ట్-ప్రొడక్షన్, VFX, యానిమేషన్, మ్యూజిక్ ప్రొడక్షన్ మొదలైన వాటి కోసం శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి సృజనాత్మక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నెట్‌ఫ్లిక్స్, మంత్రిత్వ శాఖ భాగస్వాములు అవుతున్నట్టు అనురాగ్‌ ఠాకూర్ వెల్లడించారు. భారతదేశాన్ని కంటెంట్ హబ్‌గా మార్చడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుందని, ఇక్కడ చలనచిత్ర నిర్మాతలు కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి అన్ని అవశాలు ఉంటాయన్నారాయన. 

"ఈ ఒప్పందం తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలు భారతీయ ప్రేక్షకుల కోసం మాత్రమే కాకుండా, ప్రపంచంలో ప్రేక్షకుల కోసం సినిమాలు, డాక్యుమెంటరీలను రూపొందించడానికి భారతదేశానికి వస్తారని నేను ఆశిస్తున్నాను" అని ఠాకూర్ అభిప్రాయపడ్డారు. 

గత నవంబర్‌లో గోవాలో జరిగిన 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం నుంచి నెట్‌ఫ్లిక్స్, I&B మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయడం ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ 2022 మొదటి త్రైమాసికంలో 200,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. రెండో త్రైమాసికంలో మరో రెండు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతామని ఆందోళన చెందుతోంది. అందుకే స్థానిక కంటెంట్ రూపొందించడంతోపాటు వివిధ వ్యూహాలను రూపొందిస్తోంది. 

Published at : 27 Apr 2022 08:11 AM (IST) Tags: ott Netflix Modi anurag thakur I&B ministry women change makers Freedom Struggle Union Information and Broadcasting Azadi Ki Amrit Kahaniya

సంబంధిత కథనాలు

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు

CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా

Horoscope Today 23 May 2022: ఈ రాశివారు ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకపోవడమే మంచిది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 23 May 2022: ఈ రాశివారు ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకపోవడమే మంచిది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి