అన్వేషించండి

Neha Pathan: షూటింగ్స్‌లో షణ్ముఖ్‌ అలా ఉంటాడు - కొంచెం కష్టంగా అనిపించింది: నేహా పఠాన్

Neha Pathan: ‘స్టూడెంట్’ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది నేహా పఠాన్. ఇక ఆ సిరీస్‌లో తనతో పాటు నటించిన షణ్ముఖ్ జశ్వంత్‌పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.

Neha Pathan About Shanmukh Jaswanth: షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల నుంచి చాలామంది నటీనటులు వెండితెరపై వెలగడానికి అవకాశాలు దక్కించుకుంటారు. అలాంటి వారిలో నేహా పఠాన్ కూడా ఒకరు. షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా నటించిన ‘స్టూడెంట్’ అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటించి యూత్‌కు బాగా దగ్గరయ్యింది నేహా. తను లీడ్ రోల్ చేసిన సినిమాలకంటే ఈ సిరీసే తన కెరీర్‌కు పెద్ద ప్లస్ అయ్యింది. అందుకే కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ‘సత్యభామ’లో కూడా నేహాకు ఒక కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది. ఇక ‘స్టూడెంట్’ గురించి, షణ్ముఖ్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నేహా పఠాన్.

కామెంట్ చేయను..

‘‘స్టూడెంట్ వెబ్ సిరీస్ అనేది నా కెరీర్‌కు చాలా హెల్ప్ చేసింది. షణ్ముఖ్ అంటే అందరికీ తెలుసు. అందుకే షూట్ చేస్తున్నప్పుడు అందరు వచ్చి చూడడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ తను చాలా డెడికేషన్‌తో ఉంటాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. పర్సనల్‌గా కూడా తను చాలా మంచి వ్యక్తి. ఒక ఫ్రెండ్‌గా చాలా హెల్ప్ చేశాడు. ఎందుకంటే నాకు తెలుగు రాదు కదా. ఎలా పెర్ఫార్మ్ చేయాలో చెప్తుండేవాడు. వెబ్ సిరీస్‌లో చాలా పెద్ద సీన్స్ ఉన్నాయి. తనకు ఉన్న వేరే ప్రాబ్లమ్స్ గురించి నేను కామెంట్ చేయను’’ అని షణ్ముఖ్‌ గురించి చెప్పుకొచ్చింది నేహా పఠాన్. ఇక వెబ్ సిరీస్, సినిమాల్లో తేడా గురించి కూడా తను మాట్లాడింది.

అదే తేడా..

‘‘వెబ్ సిరీస్, సినిమాల్లో చాలా తేడా ఉంటుంది. సిరీస్‌ను చాలా తొందరగా షూట్ చేస్తారు. ఎందుకంటే స్క్రిప్ట్ పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ కనీసం 40 నిమిషాలు ఉంటుంది. సినిమాలకు టైమ్ తీసుకొని నచ్చినట్టుగా షూటింగ్ చేస్తారు. రీటేక్స్ అయినా, టైమ్ పట్టిన పర్వాలేదు సినిమా బాగుండాలి అనుకుంటారు’’ అంటూ తేడాను తెలిపింది నేహా పఠాన్. ఇక తను ముంబాయ్‌లో పుట్టి, పెరిగిన అమ్మాయి అని, 12 ఏళ్ల నుండే యాక్టింగ్ ప్రారంభించానని బయటపెట్టింది. ముందుగా మరాఠీలో కూడా ఒక వెబ్ సిరీస్ చేశానని తెలిపింది. తెలుగు తనకు రాదు కాబట్టి నేర్చుకోవడానికి కష్టపడుతున్నానని చెప్పుకొచ్చింది నేహా.

భయపడ్డాను..

‘సత్యభామ’లో కాజల్ అగర్వాల్‌తో కలిసి పనిచేసిన ఎక్స్‌పీరియన్స్‌ను కూడా ప్రేక్షకులతో షేర్ చేసుకుంది నేహా పఠాన్. ‘‘ఆమె పెద్ద స్టార్ అనే ఆరా తన చుట్టూ ఉంటుంది. మొదట్లో ఆమెతో కలిసి నటించాలంటే నేను కొంచెం భయపడ్డాను. తను పెద్ద స్టార్, మొదటిసారి నా పక్కన కూర్చున్నారు అనుకునేదాన్ని. తర్వాత నేను చాలా సౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేసింది. చాలా హెల్ప్ చేసింది. తను ముందుకు వచ్చి నిలబడితే నేనేం మాట్లాడలేను. ఆమెపై అభిమానం ఉంది, అలాగే పెద్ద స్టార్ అని భయం కూడా ఉంది’’ అని చెప్పింది. తనకు ఎప్పుడూ ఒక గర్ల్‌ఫ్రెండ్ రోల్‌లోనే కనిపించడం కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ చేయాలి అనేది తన కల అని బయటపెట్టింది.

Also Read: దుల్కర్ సల్మాన్ జోడీగా రవితేజ హీరోయిన్ - ఫస్ట్ సినిమా రిలీజుకు ముందు ఇంకో రెండు ఆఫర్లు!

టాప్ హెడ్ లైన్స్

Trikala OTT : ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల
ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల
Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
Dug Dug OTT : ఆ ఊరికి బైకే దేవుడు - ఓటీటీలోకి సడన్‌గా సెటైరికల్ కామెడీ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ ఊరికి బైకే దేవుడు - ఓటీటీలోకి సడన్‌గా సెటైరికల్ కామెడీ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ekasekalu Series OTT : ఓటీటీలోకి క్రేజీ మినీ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి క్రేజీ మినీ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
Embed widget