Mowgli OTT : రోషన్ కనకాల 'మోగ్లీ' ఓటీటీ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Mowgli OTT Platform : టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల లేటెస్ట్ మూవీ 'మోగ్లీ' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సొంతం చేసుకుంది.

Roshan Kanakala Mowgli Movie OTT Platform Locked : యాంకర్ సుమ కొడుకు టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'మోగ్లీ' శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'కలర్ ఫోటో' ఫేం సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా... స్టార్స్ లేకున్నా రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫాం కూడా లాక్ అయ్యింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్' (EtvWin) సొంతం చేసుకోగా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ప్రస్తుతం కొన్ని మూవీస్ నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. 'మోగ్లీ' సైతం థియేట్రికల్ రన్ తర్వాత 4 నుంచి 6 వారాల మధ్యలో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మూవీలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు హర్ష చెముడు, బండి సరోజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. అలాగే, సుహాస్, రియా సుమన్ అతిథి పాత్రల్లో మెరిశారు. కాలభైరవ మ్యూజిక్ అందించగా... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.
Also Read : తొలి వివాహ వార్షికోత్సవం... కీర్తి సురేష్ పెళ్లి వీడియో - సెలబ్రిటీల నయా ట్రెండ్
స్టోరీ ఏంటంటే?
మురళీ కృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ కనకాల) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఓ అనాథగా మిగులుతాడు. దీంతో ఊరి పక్కనే ఉన్న అడవినే తన అమ్మగా భావించి ఉంటాడు. ఎస్సై కావాలనే లక్ష్యంతో ప్రయత్నిస్తుంటాడు. అడవిలో ఉంటూ సినిమా షూటింగ్స్ కోసం వచ్చే యూనిట్స్‌కు సాయం చేస్తూ జీవనోపాధి పొందుతుంటాడు. అలా ఓ సినిమాకు డూప్‌గా నటించాల్సి రాగా... మూవీ టీంలో డ్యాన్సర్ జాస్మిన్ (సాక్షి మడోల్కర్)ను చూసి మనసు పారేసుకుంటాడు.
ఆమె డెఫ్ అండ్ డంబ్. మాట్లాడడం వినడం రాకపోయినా మోగ్లీ ప్రేను అర్థం చేసుకుని అతన్ని ఇష్టపడుతుంది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకునే టైంలో వీరిద్దరి మధ్య ఎస్సై క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) వస్తాడు. జాస్మిన్‌పై కన్నేసిన క్రిస్టోఫర్ ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అనుకుంటాడు. దీంతో మోగ్లీ ఆమెను తీసుకుని అడవిలోకి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఇద్దరిని వెతకడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? క్రిస్టోఫర్ నుంచి జాస్మిన్‌ను కాపాడే క్రమంలో మోగ్లీకి ఎదురైన పరిణామాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















