Keerthy Suresh : తొలి వివాహ వార్షికోత్సవం... కీర్తి సురేష్ పెళ్లి వీడియో - సెలబ్రిటీల నయా ట్రెండ్
Keerthy Suresh Wedding : టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఫస్ట్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన పెళ్లి వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

Keerthy Suresh Shared Wedding Video : సాధారణంగా ఏ సెలబ్రిటీల పెళ్లి అయినా ముందు నుంచీ హడావిడి మామూలుగా ఉండదు. హల్దీ వేడుక దగ్గర నుంచీ వరుడు, వధువుగా మార్చే వరకూ ప్రతిదీ ఓ స్పెషలే. సోషల్ మీడియా వేదికగా బెస్ట్ మూమెంట్స్‌ను సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే, రీసెంట్‌గా ఓ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి టైంలో కేవలం ఫోటోలు మాత్రమే షేర్ చేస్తున్న సెలబ్రిటీలు తాజాగా ఫస్ట్ మ్యారేజ్ యానివర్శిరీ సందర్భంగా పెళ్లి వీడియో షేర్ చేస్తున్నారు.
'కీర్తి సురేష్' పెళ్లి వీడియో
తాజాగా... మహానటి 'కీర్తి సురేష్' సైతం తన ఫస్ట్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లి వీడియోను ఇన్ స్టాలో పంచుకున్నారు. హల్దీ, సంగీత్ సంబరాలతో పాటు హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో జరిగిన వివాహ వేడుకను ఈ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కీర్తి సురేష్‌తో పాటు ఆంటోని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు వేడుకలో డ్యాన్సులతో సందడి చేశారు. గతేడాది డిసెంబర్ 12న తన స్నేహితుడు, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆంటోనీని కీర్తి సురేష్ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ వచ్చినా రీసెంట్‌గా మళ్లీ మూవీస్‌తో బిజీ అయ్యారు.
View this post on Instagram
Also Read : 'అఖండ' ఓ సూపర్ మ్యాన్ - నో లాజిక్ విమర్శలకు బోయపాటి స్ట్రాంగ్ కౌంటర్
రీసెంట్‌గా నాగ చైతన్య - శోభిత దూళిపాళ తమ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీని జరుపుకోగా... వెడ్డింగ్ వీడియోను షేర్ చేశారు. చై తన లైఫ్‌లోకి వచ్చాక జీవితం పరిపూర్ణమైందని అన్నారు. బెస్ట్ మూమెంట్‌ను షేర్ చేయగా వైరల్ అయ్యింది. తాజాగా అదే బాటలో కీర్తి సురేష్ సైతం తన పెళ్లి వీడియోను షేర్ చేశారు.





















