అన్వేషించండి

Mirzapur 3 Teaser : ‘మీర్జాపూర్ - 3’ టీజర్: అడవిలో వేటకు సిద్ధమవుతున్న పులులు, సింహాలు - ఈ సారి తెలుగులో వస్తుందా?

Mirzapur - 3: 'మీర్జాపూర్' సిరిస్ ఫ్యాన్స్ కి అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ చెప్పింది. స‌స్పెన్స్ లో పెట్టిన 'మీర్జాపూర్ - 3' రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించేసింది. మ‌రి రిలీజ్ ఎప్పుడంటే?

Mirzapur Season 3 Teaser: 'మీర్జాపూర్' సిరీస్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇండియా మొత్తంలో చాలామంది ఈసిరిస్ కి ఫ్యాన్స్. పొలిటికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా సిరీస్ ఇది. ఇక ఇప్ప‌టికే రెండు సీజ‌న్లు రిలీజై హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మూడో సీజ‌న్ కోసం ఎదురు చూశారు చాలామంది. మూడో సీజ‌న్ ప్రక‌టించిన‌ప్ప‌టి నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతందా? ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని తెగ ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు వాళ్ల‌ కోసం ప్రత్యేకంగా టీజర్ వదిలి మరీ గుడ్ న్యూస్ చెప్పింది అమెజాన్ ప్రైమ్. రిలీజ్ డేట్ ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది.

ఈ సీజన్‌లో గుడ్డు, గోలు, అఖండ మాత్రమే కాదు.. కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో ఈ సీరిస్‌పై అంచనాలు పెరిగిపోయాయి. సీజన్-2లో మున్నాభాయ్ మర్డర్‌తో గుడ్డు రివేంజ్ తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్నా హత్యకు ప్రతీకారం తీర్చుకొనేందుకు అఖండానంద్ త్రిపాఠి (పంకజ్ త్రిపాఠి) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. అడవిలో పులులు, సింహాలు వేటకు సిద్ధమవుతున్నట్లుగా చూపించారు.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

అమెజాన్ లో సూప‌ర్ హిట్ అయిన సిరీస్ ల‌లో మీర్జాపూర్ ఒక‌టి. ముందు హిందీలో రిలీజైన ఈసిరీస్ ఆ త‌ర్వాత తెలుగులో అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో ఈ సీరీస్‌‌కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. సీజన్-2‌ను కూడా మొదట హిందీలో రిలీజ్ చేసి.. కొద్ది రోజుల తర్వాత తెలుగు లాంగ్వేజ్ యాడ్ చేశారు. మరి, సీజన్-3 కూడా అలాగే చేస్తారా? లేదా హిందీతోపాటు తెలుగులో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి. తాజా రిలీజైన టీజర్‌లో కూడా ఏయే భాషల్లో రిలీజ్ అవుతుందనేది చెప్పలేదు. కేవలం హిందీ టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. కొత్త సీజన్ జులై 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

‘మీర్జాపూర్’ సీజన్-3

'మీర్జాపూర్ -3' రిలీజ్ డేట్ ని క‌నుక్కోండి అంటూ ఒక ప‌జిల్ ని ఇచ్చింది అమెజాన్. దీంతో ప్రేక్ష‌కులు అంద‌రూ జులై 7న రిలీజ్ అవుతుంద‌ని గెస్ చేశారు. ఇంకొంత‌మందైతే జులై 21న అని అనుకున్నారు. కానీ, వాళ్ల అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ, రెండు రోజుల ముందే రిలీజ్ అవుతుంది. ఫొటోలో ఇచ్చిన ప‌జిల్ లో అన్ని ఏడ్లు క‌నిపించ‌డం, పౌర్ణ‌మి చంద్రుడు క‌నిపించ‌డంతో అంద‌రూ 7న లేదా పౌర్ణ‌మి రోజైన 21న రిలీజ్ అనుకున్నారు. కానీ, అంద‌రి అంచ‌నాలు త‌ప్పాయి. 

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని మీర్జాపూర్ అనే ప్రాంతం నేప‌థ్యంలో తీశారు ఈ వెబ్ సిరీస్. మొద‌టి సీజ‌న్ 2018లో అమెజాన్ లో ఈ సిరీస్ రిలీజ్ అయ్యింది. హిందీలో రిలీజైన వెబ్ సిరీస్ కి మంచి ఆద‌ర‌ణ రావ‌డంతో మిగ‌తా భాష‌ల్లో కూడా రిలీజ్ చేశారు. అన్ని భాష‌ల్లో  'మీర్జాపూర్' సూపర్ హిట్ అయ్యింది. బోల్డ్ కంటెంట్, యాక్ష‌న్ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈ సిరీస్ కి యూత్ బాగా క‌నెక్ట్ అయ్యారు. ఇక ఓటీటీలో రిలీజ్ కావ‌డంతో ఎలాంటి రెస్ట్రిక్ష‌న్స్, సెన్సార్ లేకుండా బూతులు కూడా ఉంటాయి ఈ సిరీస్ లో. దీంతో యూత్ క్రేజీగా ఫీల్ అయ్యి పెద్ద స‌క్సెస్ చేశారు. ఇక ఫ‌స్ట్ పార్ట్ కి కొనసాగింపుగా రెండో సీజన్ ను 2020 అక్టోబరు 23న రిలీజ్ చేశారు. రెండు సీజన్లు కూడా మంచి హిట్ సాధించడంతో మూడో సీజన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇందులో శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు నటించారు. ముఖ్యంగా ఇందులోని మున్నా భాయ్, గోడ్డు భాయ్, గోలు అఖండానంద్‌ పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. 

Also Read: న‌వ‌దీప్ న‌టిస్తే రొమాన్స్.. ప్రొడ్యూస్ చేస్తే వయొలెన్స్: విశ్వ‌క్ సేన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rakasa OTT : ఓ వైపు బైకర్... మరోవైపు రాకాస - ఒకే ఓటీటీలోకి రెండు మూవీస్... ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓ వైపు బైకర్... మరోవైపు రాకాస - ఒకే ఓటీటీలోకి రెండు మూవీస్... ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Pochamma Series OTT : పోచమ్మ విగ్రహం వెనుక మిస్టరీ ఏంటి?- మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పోచమ్మ విగ్రహం వెనుక మిస్టరీ ఏంటి?- మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Financial Web Series OTT : బ్యాంక్ జాబ్స్, స్టాక్ మార్కెట్స్, డైమండ్స్ ఇంట్రెస్ట్ ఉందా? - ఈ టాప్ 3 వెబ్ సిరీస్ మీ కోసమే!
బ్యాంక్ జాబ్స్, స్టాక్ మార్కెట్స్, డైమండ్స్ ఇంట్రెస్ట్ ఉందా? - ఈ టాప్ 3 వెబ్ సిరీస్ మీ కోసమే!
Mrithyunjay OTT : ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Extramarital Affairs in Hyderabad : సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Donald Trump: అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
Office Astrology: మీరు ఆఫీసులో పనిలో వెనుకబడుతున్నారా? కెరీర్‌లో దూసుకెళ్లేందుకు 5 శక్తివంతమైన చిట్కాలు!
మీరు ఆఫీసులో పనిలో వెనుకబడుతున్నారా? కెరీర్‌లో దూసుకెళ్లేందుకు 5 శక్తివంతమైన చిట్కాలు!
Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్
Embed widget