అన్వేషించండి

Manchu Lakshmi: రేవ్ పార్టీపై స్పందించిన మంచు ల‌క్ష్మీ - నా సపోర్ట్ ఎప్పుడు వాళ్ల‌కే!

Manchu Lakshmi: మంచు ల‌క్ష్మీ కీలక పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్ 'యక్షిణి'. డిస్నీ + హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో మంచు ల‌క్ష్మీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Manchu Lakshmi Comments On Rave Party: మంచు ల‌క్ష్మీ న‌టించిన వెబ్ సిరీస్ 'య‌క్షిణి'. డిస్నీ + హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగ్ అవ్వ‌నుంది. బాహుబ‌లి సినిమా మేక‌ర్స్ దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే, ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఆ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో మంచు ల‌క్ష్మీ విలేకరులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. దాంట్లో భాగంగా ఆమె ఇటీవ‌ల వివాదస్పదమైన బెంగ‌ళూరు రేవ్ పార్టీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అన్ని ఫ్యామిలీ సినిమాలు చేయ‌లేం క‌దా? 

విష్ణు, మ‌నోజ్ ల‌తో క‌లిసి ఎందుకు న‌టించ‌రు? అని అడిగిన ప్ర‌శ్న‌కి ఆమె ఆసక్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. "మా ఇంట్లో అబ్బాయిలు నాతో చేయ‌డానికి భ‌య‌ప‌డ‌తారు అని అంటూ ఉంటాను నేను. నేను చేస్తే వాళ్లు చేయ‌రు అనుకుంటా. అది వాళ్ల‌నే అడ‌గండి న‌న్ను కాదు. నా సపోర్ట్ ఎప్పుడు వాళ్ల‌కే ఉంటుంది. అలా అని క్యారెక్ట‌ర్ చేయాల‌ని లేదు క‌దా. నాకు త‌గ్గ క్యారెక్ట‌ర్ వాళ్ల సినిమాలో లేదేమో అందుకే, నాకు ఇవ్వ‌లేదు. అంత పెద్ద సినిమాకి నాకు ఇవ్వాల‌ని లేదుగా. ప్ర‌తి సినిమాలో చేస్తే ఫ్యామిలీ సినిమా అయిపోతుందండి బాబు" అని అన్నారు మంచు ల‌క్ష్మి. 

రేవ్ పార్టీ గురించి మీరేమంటారు? 

"అక్క‌డ ఏం జ‌రిగిందో తెలీదు. ఎప్పుడు జ‌రిగిందో తెలీదు. ఇది సంద‌ర్భం కూడా కాదు. చాలా రోజుల త‌ర్వాత ఏదో ఒక సిరీస్ వ‌చ్చింది. దాని గురించి మాట్లాడ‌దాం. ఎవ‌రో ఎప్పుడో ఎక్క‌డికో వెళ్తే నాకు ఏంటండి సంబంధం? ద‌ట్ ద‌ట్ ప‌ర్స‌న్, ద‌ట్ ద‌ట్ ప్రాబ్ల‌మ్ అంతే" అని తెలిపింది.

నా సినిమా వెళ్లాలి నేను కాదు..  

"కాన్స్ కి న‌న్ను ఎవ్వ‌రూ పిల‌వ‌లేదు అండి. ఈ రిలీజ్ కోసం ఆగిపోయాను (న‌వ్వుతూ). కాన్స్ కి వెళ్ల‌డం అనేది బిగ్ డీల్ అనుకుంటారు అంద‌రూ. కాన్స్ అనేది సినిమా విలేజ్. అంద‌రూ వెళ్లాల్సిందే. ఛాన్స్ వ‌స్తే అంద‌రూ క‌చ్చితంగా వెళ్లండి అక్క‌డికి. ఊరికే వెళ్ల‌డం అనేది ఫ‌న్. కానీ, నేను అలా వెళ్లాలి అనుకోవ‌ట్లేదు. నా సినిమా వెళ్లాలి అనుకుంటున్నాను. విష్ణు, నాన్న‌, ప్ర‌భుదేవ వాళ్ల సినిమాని తీసుకెళ్లారు. అదేమీ ఫ్యామిలీ ఔటింగ్ కాదు" అని త‌ను కాన్స్ కు వెళ్ల‌క‌పోవ‌డం గురించి క్లారిటీ ఇచ్చారు మంచు ల‌క్ష్మీ. 

వెబ్ సిరీస్ విష‌యానికొస్తే.. 'బాహుబ‌లి' మేక‌ర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. హాట్ స్టార్, ఆర్క్ మీడియా సంయుక్తం దీన్ని తీసుకొస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రొమాన్స్‌, కామెడీ, హారర్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది ఈ వెబ్‌ సిరీస్‌. "అబ్బాయి జాగ్రత్త. మీ కోసం త్వరలో యక్షిణి వస్తుంది. ఆమె చివరి వేట త్వరలో ప్రారంభం కాబోతుంది" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు.  

బెంగ‌ళూరు శివారులోని ఒక గెస్ట్ హౌస్ లో రేవ్ పార్టీ ఇటీవ‌ల క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆ పార్టీలో ఎంతోమంది తెలుగు సినీ ప్ర‌ముఖులు ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. ఇప్ప‌టికే హేమ పేరు ఉన్న‌ట్లు, ఆమె బ్ల‌డ్ లో డ్ర‌గ్స్ కూడా ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం రేవ్ పార్టీ సినిమా ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపుతోంది.  

Also Read: సమంతతో రొమాంటిక్ సీన్స్, సిగ్గుపడ్డ నాగచైతన్య - వీడియో వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget