Maareesan OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన 'మారీశన్' - అల్జీమర్ పేషెంట్‌తో ఓ దొంగ ఊహించని జర్నీని తెలుగులోనూ చూసెయ్యండి
Maareesan OTT Platform: మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మారీశన్' ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు 5 భాషల్లో అందుబాటులో ఉంది.

Vadivelu's Maareesan OTT Streaming On Netflix: మరో కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ లేటెస్ట్ కామెడీ ఎమోషనల్ డ్రామా 'మారీశన్' తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకోగా... నెల రోజుల్లోపే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో శుక్రవారం నుంచి 'మారీశన్' స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తమిళం, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ''వడివేలు, ఫాఫా... మీ తదుపరి కదలికను వారికి ఎప్పుడూ తెలియజేయవద్దు' అంటూ చాలా సీరియస్‌గా తీసుకున్నారు.' అంటూ నెట్ ఫ్లిక్స్ రాసుకొచ్చింది. ఈ మూవీకి సుదీశ్ శంకర్ దర్శకత్వం వహించగా... ఫహాద్, వడివేలుతో పాటుగా కోవై సరళ, రేణుక, లివింగ్ స్టన్, వివేక్ ప్రసన్న, సీనియర్ నటి సితార, శరవణన్ సుబ్బయ్య, తీనప్పన్ కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా... కామెడీ, ఎమోషన్ కలగలిపి ఫుల్ ట్రీట్ ఇస్తూనే... ఫహాద్, వడివేలు నవ్వులు పూయించారు.
View this post on Instagram
Also Read: స్లమ్ ఏరియాలో నలుగురు యువకుల స్టోరీ - ఓటీటీలోకి '4.5 గ్యాంగ్' వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
స్టోరీ ఏంటంటే?
ఓ అల్జీమర్ పేషెంట్ ఓ దొంగ మధ్య ప్రయాణాన్ని 'మారీశన్'లో ఆసక్తికరంగా చూపించారు. దయాలన్ (ఫహాద్ ఫాజిల్) ఓ దొంగ కగా వేలాయుధం (ఫహాద్ ఫాజిల్) అల్జీమర్ పేషెంట్. అలాంటి వేలాయుధం వద్ద చాలా డబ్బు ఉందని తెలుసుకున్న దయాలన్ కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. దీని కోసం వేలాయుధంతో పరిచయం పెంచుకుంటాడు. తన ఫ్రెండ్‌ను కలిసేందుకు ఊరికి వెళ్తున్న వేలాయుధాన్ని మాటల్లో పెట్టి తన బైక్ ఎక్కేలా చేస్తాడు. ఇద్దరూ కలిసి వేలాయుధం ఫ్రెండ్ ఊరికి బయలుదేరగా ఆ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
అసలు వేలాయుధం దగ్గర డబ్బులను దయాలన్ కొట్టేశాడా? లేదా వేలాయుధం పరిస్థితి చూసి ఏమైనా మారాడా? ఈ జర్నీలో వారు ఎదుర్కొన్న పరిణామాలేంటి? ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















