Kuberaa OTT Streaming: బిచ్చగాడు వర్సెస్ రిచ్చెస్ట్ పర్సన్ - ఓటీటీలోకి వచ్చేసిన 'కుబేర'... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Kuberaa OTT Platform: ధనుష్, నాగార్జున రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కుబేర' ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్నా... నెల రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Dhanush's Kuberaa OTT Streaming On Amazon Prime Video: కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ఇది అతని ప్రపంచం. తనను తాను నిరూపించుకునేందుకు అతను సిద్ధంగా ఉన్నాడు.' అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్లలో హిట్ టాక్ వచ్చినా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ధనుష్, నాగార్జునతో పాటు రష్మిక, జిమ్ సర్బ్, దలీప్ తాహిల్, ప్రియాంశు ఛటర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
it's his world and he's here to prove it 😎#KuberaaOnPrime, Watch Now: https://t.co/NjXCIAKZ2D@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @jimSarbh @sekharkammula @ThisIsDSP @mynameisraahul @AdityaMusic @KuberaaTheMovie @SVCLLP @amigoscreation pic.twitter.com/k5UPB5gnWm
— prime video IN (@PrimeVideoIN) July 17, 2025
రిచ్చెస్ట్ పర్సన్ వర్సెస్ బిచ్చగాడు స్టోరీ
దేశంలోనే నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్) అత్యంత సంపన్నుడు వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్ కావాలనేది అతని లక్ష్యం. దీని కోసం బంగాళాఖాతంలో భారీ ఆయిల్ రిగ్ బయటపడగా దాన్ని సొంతం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రూ.లక్ష కోట్లకు డీల్ కుదుర్చుకుంటాడు. అయితే, రూ.50 వేల కోట్లు బ్లాక్, రూ.50 వేల కోట్లు వైట్‌గా ఇవ్వాలని వారు కండిషన్ పెట్టగా.. తన చేతికి మట్టి అంటకుండా ఆ డబ్బును వారి అకౌంట్లలోకి చేర్చేందుకు ప్లాన్ చేస్తాడు నీరజ్.
దీని కోసం నిజాయతీ పరుడైన దీపక్ సాయం తీసుకుంటాడు. ఓ మంత్రి ఇంటిపై రైడ్ చేసిన దీపక్‌ను కుట్రతో జైల్లో పెట్టగా... తన పలుకుబడితో బయటకు తీసుకొచ్చి తాను చెప్పింది చేసేలా ప్లాన్ చేస్తాడు నీరజ్. దీపక్ నలుగురు బిచ్చగాళ్లను ఎంచుకుని వారి పేరుతో ఫేక్ బినామీ కంపెనీలు సృష్టించి వారి ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని అనుకుంటాడు. అలా రెండు ట్రాన్సాక్షన్స్ చేయగా దేవా (ధనుష్) దగ్గరికి వచ్చేసరికి అది ఫెయిల్ అవుతుంది. అయితే, నీరజ్ గ్యాంగ్ నుంచి తప్పించుకుంటాడు దేవా. దీంతో దీపక్, నీరజ్ అతన్ని పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. అసలు దేవా మళ్లీ తిరిగి ఎందుకొచ్చాడు?, దీపక్ దేవాకు ఎలాంటి సహాయం చేశాడు? నీరజ్ స్కాం బయటపడిందా? రూ.10 వేల కోట్ల కోసం నీరజ్ బిచ్చగాడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? తన అకౌంట్లో ఉన్న డబ్బుతో దేవా ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















