అన్వేషించండి

Kakuda Movie: ఓటీటీలో నవ్విస్తూ.. భయపెడుతోన్న ‘కకుడా’ - మూడు రోజుల్లోనే ఆ రికార్డ్ బ్రేక్ చేసిందిగా!

Kakuda Movie OTT: ఈరోజుల్లో నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాల సంఖ్య తగ్గిపోయింది. అలా తాజాగా ఒక హారర్ కామెడీ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను తెగ ఇంప్రెస్ చేసేస్తోంది.

Kakuda Movie Record On OTT: థియేటర్లు యాక్టివ్‌గా ఉన్నా ఇప్పటికీ కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా నేరుగా విడుదలయిన సినిమాలను కూడా మొదటిరోజే చూసేయాలని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఒకవేళ నేరుగా ఓటీటీలోకి వచ్చిన మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే దానికి రికార్డ్ స్థాయిలో వ్యూస్ ఖాయం. తాజాగా ఒక హారర్ కామెడీ మూవీ కూడా మరోసారి ఈ సక్సెస్ ఫార్ములాను రిపీట్ చేసింది. అదే ‘కకుడా’. జులై 12న ఓటీటీలో విడుదలయిన ఈ మూవీ.. మూడురోజుల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

హారర్ కామెడీ..

రితేష్ దేశ్‌ముఖ్, సోనాక్షి సిన్హా, సఖీబ్ సలీమ్, ఆసిఫ్ ఖాన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘కకుడా’.. జులై 12న నేరుగా జీ5 ఓటీటీలో విడుదలయ్యింది. గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రాలు మంచి హిట్‌ను అందుకుంటున్నాయి. ‘కకుడా’ కూడా అదే జోనర్‌కు చెందింది. కానీ దీనిని థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల చేశారు మేకర్స్. ఓటీటీలో మంచి హారర్ మూవీ విడుదల అయ్యిందని తెలియగానే చాలామంది దీనిని మొదటిరోజు చూడడానికి సిద్ధమయ్యారు. చూసినవారు దగ్గర నుండి పాజిటివ్ టాక్ రావడంతో ‘కకుడా’కు వ్యూస్ పెరిగాయి.

అప్పుడు థియేటర్.. ఇప్పుడు ఓటీటీ..

దర్శకుడు ఆదిత్య సర్పోదర్ ఇప్పటికే హారర్ కామెడీ చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట అని గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటికే ‘ముంజ్య’తో థియేటర్లలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ అందుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక అలాంటి డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రం కావడంతో ‘కకుడా’పై ముందు నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. థియేటర్లలో ‘ముంజ్య’ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించగా.. ఓటీటీలో ‘కకుడా’ రికార్డ్ స్థాయిలో వ్యూస్‌తో దూసుకుపోతోంది. విడుదలయిన మూడు రోజుల్లోనే ఈ సినిమాకు 100 మిలియన్‌కు పైగా స్ట్రీమింగ్ మినట్స్ దక్కాయి. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 (@zee5)

రితేష్ కమ్‌బ్యాక్..

రతోడి అనే ఊరిలో ప్రతీ మంగళవారం రాత్రి 7.15 నిమిషాలకు కకుడా అనే దెయ్యం వస్తుంది. అది వచ్చినప్పుడు తలుపులు తెరిచి ఉండకపోతే ఆ ఇంటిలోని మగవారిని కకుడా చంపేస్తుంది. అది కూడా వెంటనే చంపదు. 13 రోజులు టైమ్ ఇచ్చి మరీ చంపుతుంది. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘కకుడా’కు హారర్ కామెడీ లవర్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఆ కాకూదా దెయ్యాన్ని పట్టుకునే ఘోస్ట్ హంటర్‌ విక్టర్‌గా రితేష్ దేశ్‌ముఖ్ రంగంలోకి దిగుతాడు. గత కొన్నాళ్లుగా రితేష్ దేశ్‌ముఖ్.. సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. అలాంటి ఈ హీరోకు ‘కకుడా’ మంచి హిట్‌ను అందించింది.

Also Read: షారుఖ్, రణవీర్‌లకు విలువైన బహుమతినిచ్చిన అనంత్ అంబానీ - వాటి విలువ ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Crime Thriller Movies OTT : ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
Crime Thrillers OTT : ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget