అన్వేషించండి

IBomma Controversy : ఐ బొమ్మా..! నువ్వు చంపుతోంది చిన్న సినిమాలనేనమ్మా…! కౌంటర్ ఇచ్చిన యాక్టర్, ప్రొడ్యూసర్ బోస్

IBomma: పెద్ద సినిమాల దోపిడీని అడ్డుకోవడానికే తాను వచ్చినట్లుగా IBomma పేరుతో ఓ నోట్ వైరల్ అవుతోంది. అయితే ఈ సైట్‌తో ..నష్టపోతోంది తన లాంటి చిన్న నిర్మాతలు, నటులే అని నటుడు బోస్ ఓ పోస్ట్ పెట్టారు.

IBomma Controversy : నాలుగైదు రోజులుగా IBomma  విపరీతమైన ట్రెండింగ్‌లో ఉంది. ఐ బొమ్మ పైరసీ సైట్‌ను మూసేస్తే.. అందరి బండారం బయటపెడతామంటూ ఐబొమ్మ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక టెంప్లేట్ తిరుగుతోంది. పెద్ద సినిమాల దోపిడీని అడ్డుకోవడానికే IBomma ఉంంది అనే తరహాలో ఆ నోట్ ఉంది. ఆ నోట్ నిజమైందా.. ఇప్పటిదా కాదా అని వెరిఫై చేయకముందే బాగా వైరల్ అయింది. అయితే IBomma పేరుతో ఉన్న నోట్‌లో విషయాలు సరైనవి కావని.. వాళ్ల వల్ల చిన్న సినిమాలే నష్టపోతున్నాయని యాక్టర్, నిర్మాత బోసు కంచర్ల రిటార్ట్ ఇచ్చారు. గద్దర్ నా ఓటు 2000 సినిమా లీడ్ యాక్టర్, నిర్మాత అయిన బోసు..  IBomma వల్ల నష్టపోయేది చిన్న సినిమాలే అన్నారు.

  నాలుగు రోజుల కిందట ఈ పైరసీ సైట్‌ను నడుపుతున్న కొంతమందిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందుతుడిని అదుపులోకి తీసుకుని సైట్‌ను మూసేస్తామని ప్రకటించారు. అది జరిగిన వెంటనే IBomma పేరుతో ఓ వార్నింగ్ స్టేట్‌మెంట్ బయటకు వచ్చింది. “మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మేం మీ ఫోకస్ చేస్తామన్న” వార్నింగ్ తో స్టార్ట్ అయి.. సామాన్యులకు వినోదాన్ని అందుబాటులోకి తెచ్చిన తమ జోలికి వస్తే.. అందరి సంగతి తేలుస్తామని హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న ఒక నోట్ బయటకు వచ్చింది. సినిమా బడ్జెట్‌ను అనవసరంగా పెంచేస్తున్నారని.. కెమెరా ప్రింట్ వాళ్లని ఏం చేయలేక..OTT రెవిన్యూ కోసం తమ మీద నిందలు వేస్తున్నారని IBomma ఆరోపించింది. అంతే కాకుండా.. తమ చానల్‌లో చూస్తున్నవారిలో కొంతమంది మూవీ హీరోలు కూడా ఉన్నారని .. వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా బయటపెడతామని IBomma హెచ్చరించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అది రెండేళ్ల కిందటి నోట్ అని తేలింది.

మన అమరావతి మీడియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై బోసు కంచర్ల గద్దర్ నా ఓటు 2000 సినిమా నిర్మించి, నటించారు. కానీ పెద్ద బ్యానర్లు కాకపోతే.. చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల చేయడం కష్టం అవుతోందని.. అలాంటి వాటికి OTTలు కాస్త తోడ్పాటునిస్తున్నాయన్నారు. ఇప్పుడు IBomma లాంటి సైట్లు అలాంటి వేదికను కూడా లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.                     “ కన్యాకుమారి సినిమా చాలా బాగుంది. నేను కూడా 10మందికి చెప్పాను.. చూడమని.. అక్కడ వ్యూస్ పెరిగితే ఆ నిర్మాతకు..పెట్టుబడి రికవరీ అవుతుంది. . కానీ అలాంటి సినిమాను కూడా  పైరసీ సైట్‌లో పెట్టి నిర్మాతకు Oxygen  లేకుండా చేస్తున్నారు. మళ్లీ మీరు ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నారు.” అని నిలదీశారు.

చిన్న సినిమాలు పైరసీ సైట్‌లో పెట్టమని చెప్పే ధైర్యం ఉందా..?

పెద్ద సినిమాలకు వ్యతిరేకం అంటూ IBomma  పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. కానీ వాళ్ల పైరసీ సైట్‌లో చాలా వరకూ ఉండేది చిన్న సినిమాలే.. అని బోసు ఆక్షేపించారు. “౩-4 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాను తమ సైట్‌లో పెట్టం అని ఐబొమ్మ ప్రమాణం చేయగలుగుతుందా..? సోది స్టేట్‌మెంట్లు కాకుండా చెప్పిన దానికి నిలబడే దమ్ముందా..?” నిలదీశారు.  నేను నా సేవింగ్స్ మొత్తం సినిమాకే పెట్టేశాను... నేను రెమ్యునరేషన్ తీసుకోలేదు. కేవలం సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో ఇదంతా చేశాను. ఇంతవరకూ సినిమా నుంచి ఒక్క రూపాయి రాలేదు. అయినా మీరు నా లాంటి వాడి సినిమాను కూడా తీసుకొచ్చి మీ పైరసీ సైట్లలో పెడతారు. మా కలలను చంపేస్తున్నారు. ఇలా చేస్తే మేం మళ్లీ ఇంకో సినిమా చేయగలుగుతామా..? కన్యాకుమారి సినిమాను పైరసీ చేశారు. రేపు నా గద్దర్ సినిమాను చేయరని గ్యారెంటీ ఏంటి” అని బోస్ ప్రశ్నించారు.


IBomma Controversy : ఐ బొమ్మా..! నువ్వు చంపుతోంది చిన్న సినిమాలనేనమ్మా…! కౌంటర్ ఇచ్చిన యాక్టర్, ప్రొడ్యూసర్ బోస్

 

OTT లే మమ్మల్ని బ్రతికిస్తోంది.

చిన్న సినిమాలు ధియేటర్ల వద్దకు రాలేకపోతున్నాయి. భారీ కాస్టింగ్, గ్రాఫిక్స్, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలనే జనం థియేటర్లలో చూడటానికి ఇష్టపడుతున్నారు. సినిమా బాగోకపోతే.. వాటిని కూడా చూడటం లేదు.   కాస్తో కూస్తో.. చిన్న సినిమాను  బ్రతికిస్తోంది OTT మాత్రమే. ఇప్పుడు ఆ OTT ఆదాయాన్ని కూడా ఈ పైరసీ చంపేస్తోందని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలను చంపేస్తోంది… ప్రేక్షకులు.. నిర్మాతలు.. కాదు.. ఈ పైరసీ సైట్లే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Renu Desai: రేణు దేశాయ్ కథతో 'కాశీ మజిలీ'... ETV Win ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ - ఎప్పుడంటే?
రేణు దేశాయ్ కథతో 'కాశీ మజిలీ'... ETV Win ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ - ఎప్పుడంటే?
Crime Thriller OTT : అనాథల మిస్టీరియస్ మర్డర్స్ వెనుక ఉన్నది ఎవరు? - ట్రెండింగ్‌లో ఉదయ భాను థ్రిల్లర్ సిరీస్
అనాథల మిస్టీరియస్ మర్డర్స్ వెనుక ఉన్నది ఎవరు? - ట్రెండింగ్‌లో ఉదయ భాను థ్రిల్లర్ సిరీస్
Mystery Thriller OTT : చిన్నారి మిస్సింగ్... క్షుద్రపూజల కోసమేనా? - మిస్టీరియస్‌గా పరిణీతి చోప్రా వెబ్ సిరీస్... ఎందులో చూడొచ్చంటే?
చిన్నారి మిస్సింగ్... క్షుద్రపూజల కోసమేనా? - మిస్టీరియస్‌గా పరిణీతి చోప్రా వెబ్ సిరీస్... ఎందులో చూడొచ్చంటే?
Mahendragiri Varahi OTT : ఓటీటీలోకి మహేంద్ర గిరి వారాహి - సుమంత్ మైథలాజికల్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి మహేంద్ర గిరి వారాహి - సుమంత్ మైథలాజికల్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRICS Summit 2026: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ సమ్మిట్ 2026.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
Andhra Pradesh Rains Alert: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈ జిల్లాల్లో 2 రోజులపాటు భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈ జిల్లాల్లో 2 రోజులపాటు భారీ వర్షాలు
Bolarum Arms Theft: రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
TS Govt Free Insurance Scheme: ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Election Commission SIR notices: హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
Prabhas : ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
22A Lands Issue: కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Chandrababu Warning: రోజల తరబడి ఫైళ్లు క్లియర్ చేయకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే - అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
రోజల తరబడి ఫైళ్లు క్లియర్ చేయకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే - అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
Embed widget