అన్వేషించండి

Premalu OTT: ‘ప్రేమలు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Premalu OTT Release: ఇటీవల కాలంలో చాలామంది ప్రేక్షకుల మనసు దోచుకున్న సినిమా ‘ప్రేమలు’. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్ బయటికొచ్చింది.

Premalu OTT Release Date: ప్రస్తుతం మాలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో కూడా ఎక్కడ చూసినా ‘ప్రేమలు’ గురించే మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు. ఇదొక సింపుల్ క్యూట్ లవ్ స్టోరీనే అయినా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. ఇప్పటికీ ఎన్ని చిత్రాలు రిలీజ్ అవుతున్నా ‘ప్రేమలు’కు వెళ్తున్న ప్రేక్షకుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నా కూడా అప్పుడే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్ బయటికొచ్చింది. ఇక ‘ప్రేమలు’ను థియేటర్లలో మిస్ అయినవారు మాత్రమే కాదు.. థియేటర్లకు వెళ్లి చూసినవారు కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

కార్తికేయ చేతుల మీదుగా..

ఇప్పటికే ‘ప్రేమలు’ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు కూడా. కానీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం మార్చి 29 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్రారంభించుకుంటుందని తెలుస్తోంది. ఇక ఈ మలయాళ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్‌ను పూర్తిగా డామినేట్ చేసేసింది. దీనికి పోటీగా ఎన్ని తెలుగు సినిమాలు విడుదలయినా.. తెలుగు ప్రేక్షకులు మాత్రం ‘ప్రేమలు’కే ఎక్కువగా ఓటు వేశారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి రాజమౌళి తనయుడు కార్తికేయ ముందుకు రావడం విశేషం.

కలెక్షన్స్ ఎంతంటే..?

‘ప్రేమలు’ తెలుగు రిలీజ్ కోసం కార్తికేయ బరిలోకి దిగడంతో దీని తెలుగు రిలీజ్‌కు మరింత క్రేజ్ లభించింది. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డైలాగ్స్ రాయడం కూడా మూవీకి ప్లస్ పాయింట్‌గా మారింది. మలయాళంలో హిట్ అయినా కూడా తెలుగు రిలీజ్ కోసం మళ్లీ ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేసింది ‘ప్రేమలు’ టీమ్. ఇక దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిందని సమాచారం. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా.. అన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇది ఇప్పటికే బ్లాక్‌బస్టర్ కేటగిరిలోకి చేరిపోయినట్టే. అంతే కాకుండా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సినిమాకు రూ.1.43 కోట్ల కలెక్షన్ వచ్చిందని తెలుస్తోంది. తెలుగులోకి డబ్ అవ్వకముందే చాలామంది తెలుగు ప్రేక్షకులు దీనిని మలయాళంలోనే నేరుగా చూశారు కాబట్టి కలెక్షన్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు.

క్రష్ లిస్ట్‌లోకి మమితా..

‘ప్రేమలు’లో హీరోగా నస్లీన్ నటించగా.. తనకు జంటగా మమితా బైజు కనిపించింది. ఇప్పటికే మమితాను చాలామంది తెలుగు యూత్ తమ క్రష్ లిస్ట్‌లో యాడ్ చేసేశారు. సింపుల్‌గా క్యూట్ లుక్స్‌తో ఒక కాలేజీ అమ్మాయిలాగా అందరినీ ఆకట్టుకుంది ఈ భామ. అందుకే తనకు తెలుగు ప్రేక్షకులలో వచ్చిన ఆదరణను గమనించి తనను నేరుగా టాలీవుడ్‌లో అడుగుపెట్టేలా చేయాలని మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంపై మమితా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. విష్ణు విజయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో వీరితో పాటు శ్యామ్ మోహన్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్, అల్తాఫ్ సలీమ్, మాథ్యు థామస్, సంగీత్ ప్రతాప్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

Also Read: డ్రగ్‌ కేసులో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ అరెస్ట్‌? - ఆ ఛానళ్లపై నటి ఘాటు వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

The Paradise OTT: ఓటీటీలో నాని 'ప్యారడైజ్'... డేట్ ఫిక్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్? ఈ నెలలో ఎప్పుడంటే?
ఓటీటీలో నాని 'ప్యారడైజ్'... డేట్ ఫిక్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్? ఈ నెలలో ఎప్పుడంటే?
Crime Thriller OTT: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్... పోలీసుగా పార్వతి తిరువొతు... ఈ వారమే స్ట్రీమింగ్ - ఎందులోనంటే?
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్... పోలీసుగా పార్వతి తిరువొతు... ఈ వారమే స్ట్రీమింగ్ - ఎందులోనంటే?
Maremma OTT: రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
రెండు ఓటీటీల్లోకి 'మారెమ్మ'... రవితేజ ఫ్యామిలీ హీరో మాధవ్ భూపతిరాజు సినిమా స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Romantic Movie OTT : ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ - పెద్దలకు మాత్రమే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget