అన్వేషించండి

ఓంకార్ హారర్ వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24' రిలీజ్ డేట్ ఇదే - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓంకార్ 'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు మరో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అక్టోబర్ 17న హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానున్నట్లు తెలిపారు.

బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ 'రాజు గారి గది'(Rajugari Gadhi) సినిమాతో దర్శకుడిగా మారి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మొదటి సినిమానే ఓ ఫ్రాంచైజీ గా ప్లాన్ చేసి ఒక్కో భాగాన్ని విడుదల చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి 'రాజు గారి గది' 2, 3 సినిమాలు వచ్చాయి. ఇవన్నీ హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కినవి కావడం విశేషం. ఇక త్వరలోనే 'రాజు గారి గది' పార్ట్ -4 కూడా వచ్చే అవకాశం ఉంది. దానికంటే ముందుగానే ఓంకార్ ఫర్ ది ఫస్ట్ టైం 'మ్యాన్షన్ 24'(Mansion24) పేరుతో ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ కూడా హారర్ కథాంశంతో తెరకెక్కినదే.

మొదటిసారి ఈ వెబ్ సిరీస్ తో ఓంకార్ డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సీరిస్ నుంచి వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచగా, రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకొని సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఓంకార్ మార్క్ ఆఫ్ హారర్ ఎలిమెంట్స్ తో 'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ ఉండబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించింది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు మరో పోస్టర్ని విడుదల చేశారు. అక్టోబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, సీనియర్ నటుడు సత్యరాజ్, అవికా గోర్, మానస్, బిందు మాధవి, నందు ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. మొత్తం 6 ఎపిసోడ్స్ తో హారర్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా ఈ సిరీస్ సాగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో 'మ్యాన్షన్ 24' సీరీస్ కథాంశాన్ని మేకర్స్ చెప్పే ప్రయత్నం చేశారు. ఓ పాడు పడ్డ మెన్షన్ లోకి వెళ్లిన కాళిదాస్ (సత్యరాజ్) కనిపించకుండా పోతాడు. ఆయనతోపాటు ఆ మ్యాన్షన్ లోకి వెళ్లిన ఎవరు తిరిగి రారు. తన తండ్రి కోసం కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఆ మ్యాన్షన్ లోకి కాళిదాసు కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ అడుగుపెడుతుంది.

అక్కడ ఆమెకి ఎలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి? అసలు ఆ పాడుబడ్డ మ్యాన్షన్ కథేంటి? కాళిదాసు ఆ మ్యాన్షన్ లోకి ఎందుకు వెళ్ళాడు? అనే అంశాలన్నింటినీ ఈ సిరీస్ లో చూపించబోతున్నారు. 'రాజు గారి గది 3' తర్వాత దర్శకుడుగా విరామం తీసుకున్న ఓంకార్ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ సిరీస్ తో మళ్ళీ డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'బాహుబలి' లో కట్టప్ప పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఫేమస్ యాక్టర్ సత్యరాజ్ నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే కావడం గమనార్హం. భారీ తారాగణంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read : బాలీవుడ్ హీరోతో రష్మిక లిప్ లాక్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - వారణాసి విలన్ కొత్త మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - వారణాసి విలన్ కొత్త మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
This Week Movies : ఆగస్ట్ లాస్ట్ వీక్... ఎంటర్టైన్మెంట్ పీక్ - థియేటర్స్, ఓటీటీల్లో స్ట్రీమ్ అయ్యే మూవీస్ లిస్ట్
ఆగస్ట్ లాస్ట్ వీక్... ఎంటర్టైన్మెంట్ పీక్ - థియేటర్స్, ఓటీటీల్లో స్ట్రీమ్ అయ్యే మూవీస్ లిస్ట్
Alpha OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆలియా భట్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆలియా భట్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Crime Thriller OTT : అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Warangal Crime News: వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Viral Kiss Car: కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
Embed widget