Gurthukosthunnayi Series OTT : మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
Gurthukosthunnayi Series OTT : విరాజ్ అశ్విన్ రొమాంటిక్ కామెడీ నోస్టాల్జియా గుర్తుకొస్తున్నాయి సిరీస్ సూపర్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Viraj Ashwin's Gurthukosthunnayi Series OTT Streaming : 'బేబీ' ఫేం విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ నోస్టాల్జియా వెబ్ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందించిన ఈ సిరీస్ ట్రెండ్ అవుతోంది. జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కేవలం 6 రోజుల్లోనే సూపర్ రెస్పాన్స్‌తో 100+ మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకుంది. సూపర్ క్రేజ్‌తో ఇప్పుడు మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది.
రెండు ఓటీటీల్లో...
ఇప్పటికే 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్... ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ (Netflix)లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా... త్వరలోనే హిందీతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు వినోద్ గాలి దర్శకత్వం వహించగా... విరాజ్ అశ్విన్ సరసన యశశ్రీ రావు హీరోయిన్‌గా నటించారు.
అలాగే, ప్రియదర్శిని రామ్, శివన్నారాయణ, పవన్ సిద్ధు, వైవా రాఘవ, గోదావరి గోపి, రోహిణి హట్టంగడి, అనిష్ కురువిల్ల, మేఘనా సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరత్ చంద్ర నాయుడు నిర్మించారు.
Also Read : Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
స్టోరీ ఏంటంటే?
రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యే స్కూల్ ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచే రఘునాథ్ కుమార్తె వైశాలి (యశశ్రీ రావు)ను లవ్ చేస్తుంటాడు సంతోష్ (విరాజ్ అశ్విన్). ఎన్నో ప్రయత్నాలు, సవాళ్ల తర్వాత సంతోష్‌తో వైశాలి పెళ్లికి ఒప్పుకొంటాడు రఘునాథ్. ఆ ఆనందంలో తన చిన్ననాటి ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ కోసం గోవా వెళ్తాడు. జాతకం ప్రకారం మూడు రోజులు హైదరాబాద్ సిటీ వదిలి వెళ్లకూడదని వైశాలి చెప్పినా వినిపించుకోడు.
అనుకోకుండా గోవా జర్నీలో జరిగిన ప్రమాదంలో తన గతం మర్చిపోతాడు. కేవలం కొద్ది రోజుల కిందట జరిగిన సంఘటనలే అతనికి గుర్తుంటాయి. పెళ్లికి ముందే ఇలా జరగడంతో సంతోష్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తీవ్ర ఆందోళనకు గురవుతారు. పెళ్లి లోపే అతని పరిస్థితి చక్కదిద్దాలని అనుకుంటారు. మరి సంతోష్‌కు గతం గుర్తు చేసేందుకు వీళ్లు ఏం చేశారు? వైశాలి కుటుంబానికి ఈ నిజం తెలిసిందా? నిజం బయటపడకుండా ఉండేందుకు వాళ్లు చేసింది ఏంటి? ఫైనల్‌గా వీరి పెళ్లి జరిగిందా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
View this post on Instagram
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























