Sharma And Ambani Trailer: ఈటీవి విన్‌లో క్రైమ్ కామెడీ సినిమా - 'శర్మ అండ్ అంబానీ' ట్రైలర్ రిలీజ్
Sharma And Ambani Trailer: ఈటీవీ విన్‌లో ఇప్పటివరకు ఎక్కువగా ఫీల్ గుడ్ చిత్రాలే విడుదల కాగా.. మొదటిసారి ఒక క్రైమ్ కామెడీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. అదే ‘శర్మ అండ్ అంబానీ’.
Sharma and Ambani Movie OTT Release Date: క్రైమ్ కామెడీ జోనర్‌లకు రోజు రోజుకీ క్రేజ్ పెరిగిపోతోంది. ఎక్కువగా సినిమాల్లో క్రైమ్ ఉన్నా కూడా వర్కవుట్ అవ్వదేమో అని అనుమానిస్తున్న మేకర్స్... దానికి కాస్త కామెడీ యాడ్ చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసి హిట్ కొడుతున్నారు. అదే తోవలో మరో చిత్రం తెరకెక్కింది. ఈటీవీ విన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలకు సిద్ధమయిన ఈ క్రైమ్ కామెడీ సినిమా పేరు ‘శర్మ అండ్ అంబానీ’. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కేశవ కర్రీ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ వెబ్ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఈ సినిమాలో ఆసక్తికర క్రైమ్‌తో పాటు సరిపడా కామెడీ కూడా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఇంట్రెస్టింగ్ పాత్రలతో...
ఒక పెద్ద ఇంట్లో రెండు హత్యలు జరగడంతో ‘శర్మ అండ్ అంబానీ’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నెల్లూరులో ఆయుర్వేద డాక్టర్ శర్మ అనే పాత్రలో భరత్ తిప్పిరెడ్డి కనిపించాడు. తన స్నేహితుడు అంబానీగా కేశవ నటించాడు. పగలు షూ క్లీన్ చేస్తూ, రాత్రుళ్లు రోడ్డుపై పడుకునే అంబానీకి ఒక్కరోజు అయినా రిచ్‌గా బ్రతకాలి అనే కోరిక ఉంటుంది. అలా ఒక డైమండ్ దొంగతనంలో భాగం అవ్వడంతో శర్మ, అంబానీల జీవితాలు మలుపు తిరుగుతాయి. ఇక కోర్టు బోనులో నిలబడి ‘త్రేతా యుగంలో అమ్మాయిల కోసం స్వయంవరాలు ఉండేవి. ద్వాపర యుగంలో అయితే యుద్ధాలు జరిగాయి’ అంటూ ధన్య బాలకృష్ణ చెప్పే డైలాగ్‌తో తన క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.
రైటర్, హీరో, నిర్మాత...
అసలు శర్మ, అంబానీ ఆ డైమండ్ దొంగతనంలో ఎలా ఇరుక్కున్నారు, ఆ తర్వాత ఎలా తప్పించుకున్నారు అనే అంశాలు ‘శర్మ అండ్ అంబానీ’లో ఆసక్తికరంగా మారనున్నాయని తెలుస్తోంది. సినిమాలో ముఖ్య కథను ట్రైలర్‌లోనే చూపించారు మేకర్స్. ఇక ఆ కథను తెరపై ఎలా నడిపిస్తారో అని ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేశారు. ‘శర్మ అండ్ అంబానీ’తో యంగ్ ఫిల్మ్ మేకర్.. కార్తిక్ సాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ మూవీ స్క్రిప్ట్‌ను కార్తిక్ సాయితో పాటు ఇందులో హీరోగా నటించిన భరత్ తిప్పిరెడ్డి కలిసి డెవలప్ చేయడం విశేషం. రైటర్, హీరోగా మాత్రమే కాకుండా భరత్ తిప్పిరెడ్డి ఈ వెబ్ ఫిల్మ్‌కు ఒక నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
క్యారెక్టర్‌లో సస్పెన్స్..
‘శర్మ అండ్ అంబానీ’లో మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మండలిక, యష్, రూపక్, హనుమంతరావు వంటి నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. ఇక ట్రైలర్‌లో ధన్య బాలకృష్ణ పాత్ర గురించి ఎక్కువగా రివీల్ చేయకపోవడంతో తన క్యారెక్టర్‌లో ఏదో ట్విస్ట్ ఉండవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈటీవీ విన్.. ఈసారి ‘శర్మ అండ్ అంబానీ’లాంటి క్రైమ్ కామెడీ కథతో అలరించడానికి సిద్ధమయ్యింది. ఏప్రిల్ 11 నుండి ఈ మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుండి విడుదలైన ‘మనమే రాజా’ అనే పాట యూట్యూబ్‌లో 1 మిలియన్ వ్యూస్‌ను సంపాదించుకుంది.
Also Read: పెళ్లికి ముందే అలా చేయడంతో... పాపం, సన్నీ లియోన్ అంత బాధ అనుభవించిందా?