అన్వేషించండి

OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ కోసం భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న పవన్ కల్యాణ్ 'ఓజీ' విలన్!

Netflix OTT Web Series: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ'లో విలన్ రోల్ చేస్తున్న ఓ హీరో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం భారీ వెబ్ సిరీస్ ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు బాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే...

బాలీవుడ్ స్టార్ హీరోలు వెబ్ సిరీస్, ఓటీటీ ప్రాజెక్టులు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రేక్షకులలో గుర్తింపు ఉన్న హీరోలు కొందరు ఇప్పటికే చేశారు. మరికొందరు చేయడానికి, ఓ అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ చేసిన బాలీవుడ్ హీరో, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న బాలీవుడ్ నటుడితో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. పూర్తి వివరాల్లోకి వెళితే...

నీరజ్ పాండే దర్శకత్వంలో వెబ్ సిరీస్...
Emraan Hashmi New Series Netflix: ఇమ్రాన్ హష్మీ... ఈ పేరు హిందీ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు సైతం చాలా బాగా తెలుసు. ఒక సమయంలో ఆయన హీరోగా నటించిన హిందీ సినిమాల్లో పాటలు తెలుగులోనూ విపరీతంగా వినిపించాయి. ఆయనకు సీరియల్ కిస్సర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు ఇమ్రాన్ హష్మీ. ఇప్పుడు ఆయన ఒక వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నారు. 

కమల్ హాసన్, వెంకటేష్ హీరోలుగా నటించిన 'ఈనాడు' సినిమా గుర్తు ఉంది కదా! హిందీ సినిమా 'ఏ వెడ్నెస్ డే'కి అది రీమేక్. ఆ సినిమా తీసినది దర్శకుడు నీరజ్ పాండే. అదొక్కటే కాదు... అక్షయ్ కుమార్ 'బేబీ', 'స్పెషల్ చబ్బీస్' సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. హిందీలో థ్రిల్లర్స్ తీయడంలో ఆయనకు సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఒక భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుందని తెలిసింది. ప్రస్తుతానికి అది చర్చల దశలో ఉంది.

Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?


ఇమ్రాన్ హష్మీ ఇంతకు ముందు ఒక వెబ్ సిరీస్ చేశారు. 'బార్డ్ ఆఫ్ బ్లడ్' పేరుతో రూపొందిన వెబ్ సిరీస్ వీక్షకులను ఆకట్టుకుంది. మరి, ఈ కొత్త సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి. 'షో టైమ్' పేరుతో మరో వెబ్ సిరీస్ చేశారు. అది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది

Emraan Hashmi upcoming movies Telugu: పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' సినిమాతో పాటు అడవి శేష్ హీరోగా రూపొందుతున్న సూపర్ హిట్ సినిమా గూడచారి సీక్వెల్ 'జీ 2'లో కూడా ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో వెబ్ సిరీస్ తీయడం వల్ల నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియన్ ప్రేక్షకుల నుంచి కూడా వ్యూవర్షిప్ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌ అంటే ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా చూస్తారు. దాంతో ఇమ్రాన్ హష్మీకి మంచి మైలేజ్ కూడా రావచ్చు. ఆల్రెడీ 'స్పెషల్ ఆప్స్' వెబ్ సిరీస్ తీసిన అనుభవం నీరజ్ పాండేకి ఉంది. ప్రజెంట్ 'స్పెషల్ ఆప్స్ 2.0' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Also Read'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా... శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget