అన్వేషించండి

OTT Crime Thriller: చిన్నవాళ్ళతో తీసిన క్రైమ్ థ్రిల్లర్ - డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది

Rape D Movie Streaming: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటోంది. టాలెంటెడ్ ఆర్టిస్ట్ విశ్వ కార్తికేయ హీరోగా నటించిన 'రేప్ డి' నేరుగా ఓటీటీలోకి వచ్చింది.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా 'అధినాయకుడు' అని ఓ సినిమా వచ్చింది. అలాగే, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా 'శివ శంకర్', యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 'గోరింటాకు', శ్రీకాంత్ 'లేత మనసులు' సినిమాలు ఉన్నాయి కదా! బాల నటుడిగా ఆయా సినిమాల్లో అలరించారు విశ్వ కార్తికేయ (Vishwa Karthikeya). ఇప్పుడు ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. 'రేప్ డి' అని ఓ క్రైమ్ థ్రిల్లర్ చేశారు. అది నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది.  

BCineETలో రెంట్ బేసిస్ మీద!
Rape D Movie OTT Streaming: విశ్వ కార్తికేయ కథానాయకుడిగా తెరకెక్కిన 'రేప్ డి' సినిమాలో కారుణ్య చౌదరి (Karunya Chowdary) కథానాయిక. టాలెంట్ కెఫె ప్రొడక్షన్ పతాకం మీద దేవీ మేరేటీ ప్రొడ్యూస్ చేశారు. సాధ్వి, ప్రణవి సమర్పకులు. ఈ చిత్రానికి రవి శర్మ దర్శకత్వం వహించారు.వైవీ రమణ మూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలు.

Also Read: 'కమిటీ కుర్రోళ్ళు' చూస్టా... సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ - నిహారిక గురించి ఏం చెప్పారంటే?

ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమా 'రేప్ డి'. ఆగస్టు 10వ తేదీ నుంచి 'బీ సినీ నెట్' యాప్ (BCineET APP)లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్విస్ట్ ఏమిటంటే... రెంట్ బేసిస్ మీద సినిమా అందుబాటులో ఉంది. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంది. RAPED100 కూపన్ అప్లై చేస్తే... వంద రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఆగస్టు 24 నుంచి ఇతర ఓటీటీ వేదికల్లో కూడా సినిమా అందుబాటులోకి రానుందని టాక్. ఈ సినిమాలో కారుణ్య చౌదరి పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు.

Also Read: సమంతతో విడాకులకు ముందే శోభితతో నాగ చైతన్య ప్రేమ వ్యవహారం నడిపారా? లేదంటే విడాకుల తర్వాతా... అసలు నిజం ఏమిటంటే?

Rape D Movie Cast And Crew: విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి జంటగా నటించిన 'రేప్ డి' సినిమాలో వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి వికాస్ కురిమెల్ల సంగీతం అందించారు. ప్రకాష్ వేద కథ, మాటలు అందించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: భాస్కర్ ద్రోనాల, కూర్పు: మహేష్ కాసర్ల, సంగీత దర్శకుడు: వికాస్ కురిమెల్ల, నిర్మాణ సంస్థ: టాలెంట్ కెఫె ప్రొడక్షన్, సమర్పణ : సాధ్వి - ప్రణవి, నిర్మాత : దేవీ మేరేటీ, సహ నిర్మాతలు: వైవీ రమణ మూర్తి - యశ్వంత్ తోట, దర్శకత్వం: రవి శర్మ.

Also Read: సుఖేష్‌ ది ఏమి ప్రేమ రా... జాక్వెలిన్ కోసం వాయనాడ్ బాధితులకు15 కోట్ల విరాళం, 300 ఇళ్లు... ఫ్యాన్స్‌కు 100 ఐ ఫోన్ గిఫ్టులు

టాప్ హెడ్ లైన్స్

Least Eligible Bachelor Series : జబర్దస్త్ బాబుకు వైవా హర్ష బైక్ గిఫ్ట్ - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్
జబర్దస్త్ బాబుకు వైవా హర్ష బైక్ గిఫ్ట్ - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన లవ్ రొమాంటిక్ డ్రామా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన లవ్ రొమాంటిక్ డ్రామా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Crime Thriller OTT : ఓటీటీలోకి సడన్‌గా రోజా తమిళ క్రైమ్ థ్రిల్లర్ - గ్యాప్ తర్వాత కీ రోల్‌లో సీనియర్ హీరోయిన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సడన్‌గా రోజా తమిళ క్రైమ్ థ్రిల్లర్ - గ్యాప్ తర్వాత కీ రోల్‌లో సీనియర్ హీరోయిన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Campus Drivers Series OTT : ఓటీటీలోకి సరికొత్త లవ్ రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త లవ్ రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget