ఏడేళ్లు ఒకే గదిలో బంధించి అత్యాచారం, అక్కడే బిడ్డకు ప్రసవం - కన్నీళ్లు పెట్టించే సర్వైవల్ డ్రామా
ఏడేళ్లుగా ఒక గదిలో బంధించబడి అత్యాచారానికి గురై, అక్కడే కొడుకుకు జన్మనిచ్చి, చివరికి తన కొడుకుకు బయట ప్రపంచాన్ని చూపించి వెళ్లిపోయిన ఒక తల్లి కథ..రూమ్
రూమ్ (Room) 2015లో విడుదలైన ఒక సర్వైవల్ సైకలాజికల్ డ్రామా. ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటూ ఇంకెన్నో అవార్డులను అందుకుంది. ఇదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిచారు. ఏడేళ్లుగా ఒక గదిలో బంధిగా ఉంటుంది. దుండగులు పదే పదే ఆమెపై అత్యాచారం చేస్తారు. దీంతో అక్కడే ఆమె ఓ బిడ్డకు జన్మనిస్తుంది. జాకబ్‌కు ఐదేళ్లు వచ్చిన తర్వాత వారిద్దరూ బయటి ప్రపంచాన్ని చూడగలుగుతారు. అన్నేళ్లు ఆమె అనుభవించిన క్షోభ ఈ కథ.
24 ఏళ్ల జాయ్ న్యూసోమ్, ఆమె ఐదేళ్ల కుమారుడు జాక్ ఒక దుర్భరమైన చిన్న గదిలో బంధించబడుతారు. అక్కడొక మంచం, టాయిలెట్, బాత్ టబ్, టెలివిజన్, ఓ మూలన వంటగది అన్ని ఒకే గదిలో ఉంటాయి. వాళ్లకున్న ఒకే ఒక కిటికీ స్కైలైట్. వాళ్లు జాక్ బయోలాజికల్ ఫాథర్ (జాయ్‌ను బంధించి రేప్ చేసిన వ్యక్తి)ని ‘ఓల్డ్ నిక్’ అని పిలుస్తారు. అతను ఏడు సంవత్సరాల క్రితం జాయ్‌ను కిడ్నాప్ చేసి, ఆ గదిలోనే అత్యాచారం చేస్తాడు. ఆ విధంగానే జాక్ పుడతాడు. ఎంత నిరాశ కమ్ముకున్నప్పటికీ ఆమె తన కొడుకు కోసం బతకటానికి ప్రయత్నిస్తుంది. తినటానికి సరిగా తిండి లేక తీవ్ర అవస్థలు పడుతుంది. ఆ గది, దానిలోని విషయాలు మాత్రమే నిజమైనవని బయట ప్రపంచం అంటూ ఏమీ లేదని తన కొడుకును నమ్మిస్తుంది. టెలివిజన్‌లో కనిపించేవి దానిలో మాత్రమే ఉన్నాయి.. బయట ఏమీ లేదని చెప్తుంది.
ఒకరోజు జాక్‌కు తీవ్రంగా జ్వరం వచ్చిందని చెప్పి, వారు తప్పించుకోవచ్చని ప్లాన్ చేస్తుంది. కానీ ఓల్డ్ నిక్ బయటకు పోనీయకుండా, యాంటీబయోటిక్స్ తెస్తానని వెళ్తాడు. జాయ్ ఇంకో ప్లాన్ వేసి, ఓల్డ్ నిక్ వచ్చేటప్పటికి జాక్ చచ్చిపోయాడని రగ్గులో చుట్టిపెడుతుంది. బయటకు వెళ్లగానే ఎవరైనా కనపడితే హెల్ప్ కోసం పరిగెత్తమని ముందే కొడుకుకి చెప్పి ఉంచుతుంది జాయ్. ఓల్డ్ నిక్ తన పికప్ ట్రక్కు రగ్గులో చుట్టి ఉన్న జాక్ ని అంత్యక్రియలకని జాగ్రత్తగా ఎక్కించుకుంటాడు. మధ్యలో బయటి ప్రపంచాన్ని మొదటిసారి చూసిన జాక్ ఆశ్చర్యపోతాడు. అక్కడ మనిషి కనపడగానే ట్రక్కు నుంచి దూకేస్తాడు జాక్. ఓల్డ్ నిక్.. జాక్ ను తిరిగి ట్రక్కులో ఎక్కించటానికి ప్రయత్నిస్తాడు. అప్పటికే రక్షణా సిబ్బంది వచ్చి జాక్ ను కాపాడతారు. జాయ్ బందీ అయి ఉన్న గదిని కూడా కనుక్కొని ఆమెను రక్షిస్తారు.
బయటకు వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రపంచంలో ఉండటానికి జాక్ ఇబ్బంది పడతాడు. ఒక తల్లితో తప్ప ఎవరితోనూ మాట్లాడడు. మన గదికి వెళ్లిపోదాం అంటుంటాడు. జాయ్ కోపంతో, డిప్రెషన్‌తో బాధపడుతుంది. ఫ్యామిలీ లాయర్ చెప్పినందుకు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూ కి ఒప్పుకుంటుంది. కానీ, వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో డిస్టర్బ్ అవుతుంది. ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్న చేస్తుంది. చివరికి ఒకరోజు చచ్చిపోతుంది. ఈ కొత్త ప్రపంచంలో జాక్ ఎలా ఇమడగలుగుతాడనేది తర్వాత కథ. గుండెను మెలిపెట్టే ఈ సినిమా ఎన్ని రోజులైనా వెంటాడుతుంది. ఏడేళ్ల పాటు ఒక ఘోరమైన గదిలో హింస అనుభవించిన ఆ తల్లి, బయటి ప్రపంచాన్ని జయించలేకపోతుంది. తన కొడుకుకు ఎలాగైనా ప్రపంచాన్ని చూపించాలనే ఆశతో అంత కష్టాన్ని భరిస్తుంది. ఇప్పుడా తల్లి గెలిచిందా? ఓడిందా? (ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది)
Also Read: ఇదెక్కడి ప్రేమరా బాబు, పెళ్లయిన మహిళను ప్రేమిస్తాడు - ఏకంగా తన మాంసాన్నే రుచి చూపిస్తాడు, చివరికి..