అన్వేషించండి

Berlin Web Series: ఓటీటీలో అదరగొడుతోన్న ‘బెర్లిన్’ వెబ్ సీరిస్ - తెలుగులోనూ స్ట్రీమింగ్

Berlin Web Series: వెబ్‌ సిరీస్‌లను ఇష్టపడేవారికి ‘మనీ హెయిస్ట్‌’ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ఆ సిరీస్ లోని బెర్లిన్ ప్రధాన పాత్రతో మరో సిరీస్ తెరకెక్కింది.

Berlin Web Series: ‘మనీ హెయిస్ట్‌’.. వెబ్‌సిరీస్‌లను ఇష్టపడే వారికి ఈ సిరీస్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ స్పానిష్ వెబ్ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ ఈ సిరీస్ ను చాలా మంది ఇష్టపడుతారు. ‘మనీ హెయిస్ట్‌’ సిరీస్ లో వచ్చిన అన్ని సిరీస్‌లు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సూపర్ సిరీస్ నుంచి మరో సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ‘బెర్లిన్‘ పేరుతో అభిమానులను అలరిస్తోంది.

‘మనీ హెయిస్ట్‌’ కంటే ముందు బెర్లిన్‌ ఏం చేసేవాడు?

‘మనీ హెయిస్ట్‌’ సిరీస్ లలో బ్యాంకు దోపిడీ వెనుక రెండు మాస్టర్‌ మైండ్స్‌ ఉంటాయి. వారిలో ఒకరు ప్రొఫెసర్‌, మరొకరు అతడి సోదరుడు బెర్లిన్‌. వీరిలో బెర్లిన్ నటన, ఆ పాత్రను రూపొందించిన విధానం చాలా ఆకట్టుకుంటుంది. అయితే,‘మనీ హెయిస్ట్‌’ కంటే ముందు బెర్లిన్‌ ఏం చేసేవాడు? ఆయన చేసిన దొంగతనాలు, దోపిడీలు ఏంటి? అనే పాయింట్ తో ‘బెర్లిన్‌’ సిరీస్ ను తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.

తెలుగులోనూ అందుబాటులో ‘బెర్లిన్’ వెబ్ సిరీస్

బెర్లిన్‌ పాత్రలో పెడ్రో అలోన్సో అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. సమంత సిక్వోరోస్‌, ట్రిస్టన్‌ ఉల్లోవా, మిచెల్‌ జెన్నర్‌, బెగోనా వర్గాస్‌, జూలియో పెనా ఫెర్నోండోజ్‌, జోయెల్‌ శాంఛెజ్‌ ఇతర పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ లో ‘బెర్లిన్‌‘ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇందులో బెర్లిన్ లవర్ బాయ్‌లా అదరగొట్టాడు. ముచ్చటగా మూడు లవ్ స్టోరీలు, ఒక దోపిడీ ఘటనతో ఉత్కంఠభరితంగా ఈ సీరిస్ ఉంది.

8 ఎపిసోడ్లతో ‘బెర్లిన్’ వెబ్ సిరీస్

‘బెర్లిన్‘ వెబ్ సిరీస్ సుమారు 7 గంటల వ్యవధితో ఉంటుంది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సిరీస్ లో ముఖ్యంగా ఆక్షన్ హౌస్ లో ఉన్న విలువైన ఆభరణాలను ఎలా కొట్టేస్తారు? అనే విషయాన్ని చూపించారు. పారిస్ ఆక్షన్ హౌస్ లో 44 మిలియన్ యూరోల విలువైన ఆభరణాలు ఉంటాయి. వాటిని కొల్లగొట్టేందుకు బెర్లిన్(పెడ్రో అలోన్స్) ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్ లో దామియన్‌, కైలా, కామెరూన్‌, రాయ్‌, బ్రూస్‌ సాయం తీసుకుంటాడు. వీరంతా ఆయా విషయాల్లో నిపుణులు. నగలను దోపిడీ చేయడంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశాడు? ఈ మిషన్ లో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వాటిని బ్రేక్ చేసి ఎలా ముందుకు సాగుతాడు? ఈ ప్రయాణంలో నటి సమంత సిక్వోరోస్‌ తో ఎలా ప్రేమలో పడతాడు? ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదరవుతాయి? అనేది ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించారు. 

Read Also: మహిళలను వేధించిన వ్యక్తికి సన్మానమా? ముఖ్యమంత్రిపై సింగర్ చిన్మయి విమర్శలు

టాప్ హెడ్ లైన్స్

Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget