అన్వేషించండి

Animal OTT Release: ‘యానిమల్’ ఓటీటీ వెర్షన్‌లో అదనంగా ఆ 9 నిమిషాల సీన్స్ - క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

Animal OTT Release: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఓటీటీ వెర్షన్‌లో అదనంగా 9 నిమిషాలు యాడ్ చేయనున్నానని సందీప్ క్లారిటీ ఇచ్చాడు.

క సినిమాను ఒకసారి థియేటర్లలో చూడడమే ఎక్కువ అని ఫీల్ అవుతున్న సమయంలో మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లాలి అనిపించే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇటీవల విడుదలయిన సినిమాల్లో అలాంటి క్రేజ్‌ను సంపాదించుకుంది ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కలిసి క్రియేట్ చేసిన మ్యాజిక్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. 3 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న చిత్రాన్ని థియేటర్లలో ఎవరు చూస్తారులే అని అనుకున్నవారే మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లి మరీ.. ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేశారు. ఇప్పుడు ప్రేక్షకులు దృష్టి మొత్తం ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌పైనే ఉంది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

ఎన్నో సమస్యలు..

దేశవ్యాప్తంగా ‘యానిమల్’ సినిమా రూ.532.44 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. రణబీర్ కపూర్‌తో పాటు రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్.. ఇందులో కీలక పాత్రలు పోషించారు. అయితే ముందుగా ఈ సినిమాను మూడున్నర గంటల నిడివితో విడుదల చేద్దామని అనుకున్నాడట సందీప్. కానీ పలువురి ఒత్తిడి వల్ల 9 నిమిషాలను బలవంతంగా కట్ చేయాల్సి వచ్చిందని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బయటపెట్టాడు. అంతే కాకుండా ‘యానిమల్’ విడుదల దగ్గరపడుతున్న సమయంలో తను ఎదుర్కున్న సమస్యల గురించి కూడా ప్రేక్షకులకు వివరించాడు.

చాలా సమస్యలు ఉన్నాయని అనిపించింది..

‘‘సినిమాను నేను మొదటిసారి చూసినప్పుడు చాలా సమస్యలు కనిపించాయి. కంటెంట్ పరంగా, సౌండ్ పరంగా సమస్యలు ఉన్నాయని నాకు అనిపించింది. మేము అయిదు భాషల్లో విడుదల చేస్తున్నాం కాబట్టి ఏ భాషకు సౌండ్ చెకింగ్ చేస్తున్నానని అప్పుడప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. చివరి 20 రోజులు అయితే మరీ దారుణం. దాదాపు మూడు, నాలుగు రోజులు మేము మిక్సింగ్ రూమ్‌లోనే పడుకున్నాం. అలా జరగకుండా ఉండాల్సింది. మాకు మరొక వారం సమయం ఉంటే బాగుండేది. కానీ నెట్‌ఫ్లిక్స్ వర్షన్‌కు అన్ని సమస్యలను క్లియర్ చేస్తున్నాను. బ్లూరే టెక్నాలజీని కూడా ప్లాన్ చేస్తున్నాం’’ అంటూ ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా.

రణబీర్ కంట్రోల్ చేసేవాడు..

‘యానిమల్’ విషయంలో తను చాలా స్పష్టంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు వంగా. అందుకే సమస్యలు ఎదురయినప్పుడు తను కంట్రోల్ కోల్పోయేవాడని, రణబీర్ వచ్చి తనను కంట్రోల్ చేయాల్సి వచ్చేదని అన్నాడు. ‘‘నేను ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వర్షన్‌ను ఎడిట్ చేస్తున్నాను. నేను 3 గంటల 30 నిమిషాల వర్షన్‌ను థియేటర్లలో విడుదల చేయాల్సింది. కానీ ఒత్తిడి వల్ల 8 నుండి 9 నిమిషాల వరకు కట్ చేశాను. ఆ ఫుటేజ్‌ను యానిమల్ నెట్‌ఫ్లిక్స్ వర్షన్‌కు ఉపయోగిస్తాను’’ అని సందీప్ రివీల్ చేశాడు. అయితే ఇప్పటికే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చిన థియేటర్ వర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించే ఆలోచనలో ఉంది. ఇంతలో సందీప్ వచ్చి అదనంగా 9 నిమిషాలు యాడ్ చేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మరి ఫైనల్‌గా ‘యానిమల్’ ఓటీటీ వర్షన్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ప్రభాస్ కండలు గ్రాఫిక్స్ కాదు - క్లారిటీ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా

టాప్ హెడ్ లైన్స్

Gedela Raju OTT : రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Oh Sukumari OTT : తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్ - ఈ మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 14 సినిమాలు స్ట్రీమింగ్ - ఈ మూవీస్ డోంట్ మిస్
Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం - 100 కోట్ల మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget