AIR Web Series OTT Streaming: ప్రతీ ఇంటర్ విద్యార్థి స్టోరీ - ఓటీటీలోకి 'AIR' వెబ్ సిరీస్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AIT Web Series OTT Platform: మరో ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'AIR' తో ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్' ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. 'కోర్టు' మూవీ ఫేం హర్ష రోషన్ ఇందులో కీలక పాత్ర పోషించారు.

Harsh Roshan's AIR Web Series OTT Streaming: ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్, సామాజిక అంశాలు వంటి వాటిని అందించేలా ఎక్స్‌క్లూజివ్, ఒరిజినల్ కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తోంది ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'. ఇటీవల ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ అయిన సుమంత్ 'అనగనగా' మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ... ఎమోషన్ కలగలిపి అద్భుతంగా రూపొందించారు.
రియల్ లైఫ్ ఘటనలతో ఆడియన్స్ మనసు దోచేసేలా మూవీస్, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తోంది. '90s బయోపిక్', 'దిల్ సే', 'కథా సుధ' వంటి వెబ్ సిరీస్‌లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా... మరో వెబ్ సిరీస్ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతుంది. ఇంటర్ విద్యార్థుల జీవితాలు, ర్యాంకుల కోసం పేరెంట్స్ కాలేజీలు వారిపై పెట్టే ఒత్తిడి వంటి వాటిని ప్రధానాంశాలుగా తీసుకుని 'AIR' (All India Rankers) వెబ్ సిరీస్ రూపొందించారు.
'కోర్టు' మూవీ ఫేం
ఈ సిరీస్ గురువారం నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'కోర్టు' మూవీ ఫేం హర్ష రోషన్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. అతనితో పాటు భానుప్రకాష్, జయతీర్థ కీలక పాత్రలు పోషించారు. వీళ్లతో పాటు సునీల్, హర్ష చెముడు, చైతన్యరావు, రమణభార్గవ్, జీవన్ కుమార్, సందీప్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హర్ష్ రోషన్ ఇటీవల వరుస మూవీస్, సిరీస్‌లతో దూసుకెళ్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్, సలార్, స్వాగ్, సరిపోదా శనివారం, టుక్ టుక్ మూవీస్‌లో కీలక పాత్రలు పోషించారు. ఇక నాని సమర్పణలో 'కోర్టు' మూవీలో కీలక పాత్రలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నారు.
'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ షో రన్నర్‌గా వ్యవహరించారు. ఆయనతో పాటు సూర్య వాసుపల్లి ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేశారు. జోసెఫ్ క్లింటన్ డైరెక్టర్‌గా వ్యహరించారు.
Drama 📚. Dreams 💭. Dosti 🫂.
— ETV Win (@etvwin) July 2, 2025
Your student life is calling
AIR is streaming now on @ETVWin!#AIR - A Win Original series
Watch now: https://t.co/qQwPKwzKtt
✍️ Written & Directed by @josephchevveti
🎬 Produced by @sandeepraaaj & #SuryaVasupally@disisdeeepu @actorbhanu23… pic.twitter.com/jjIFJQqPcH
స్టోరీ ఏంటంటే?
ప్రతీ విద్యార్థి ఇంటర్ లైఫ్, కాలేజీ క్యాంపస్, హాస్టళ్లలో వారికి ఎదురైన అనుభవాలు... ఐఐటీ ర్యాంకుల కోసం పేరెంట్స్, లెక్చరర్ల ఒత్తిడి వంటి అంశాలే ప్రధానాంశాలుగా 'AIR' సిరీస్‌ను రూపొందించారు. టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న ముగ్గురు యువకులు ఐఐటీలో సీటు సంపాదించాలని ఎన్నో ఆశలతో ఇంటర్ కాలేజీలో చేరగా అక్కడ వారికి ఎదురైన అనుభవాలు, పేరెంట్స్ ఏం చేశారు? అక్కడ లెక్చరర్స్ వారిని ఎలా ట్రీట్ చేశారు? చివరకు వాళ్లకు ఏమైంది? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఫస్ట్ ఎపిసోడ్‌ను ఫ్రీగా అందించనున్నారు.





















