అన్వేషించండి

Satyabhama OTT: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన కాజల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ - స్ట్రీమింగ్‌ ఎక్కడో తెలుసా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సత్యభామ’ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టింది. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే..

Satyabhama Is On This OTT Platform: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన రీసెంట్ మూవీ ‘సత్యభామ’. కాజల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జూన్ 7న థియేటర్లలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. రిలీజ్ అయిన రోజే బాక్సాఫీస్ దగ్గర రూ. కోటి రూపాయలు వసూలు చేసింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కు మానవ అక్రమ రవాణా, ఉగ్రవాదం లాంటి అంశాలను జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కించుకుంది.  ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి అడుగు పెట్టింది. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోనే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకుండానే ఓటీటీలో రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి..

కాజల్ హిట్ మూవీ ‘సత్యభామ’ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో చూడలేని సినీ అభిమానులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.   ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌ రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.  శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్క, బాబి తిక్క నిర్మాతలుగా వ్యవహరించారు.    

ఇంతకీ ‘సత్యభామ’ కథ ఏంటంటే?

సత్యభామ(కాజల్) షీ టీమ్స్ ఏసీపీగా ఉంటుంది. కూల్ గా కనిపించే సత్యభామ నిందితుల నుంచి వాస్తవాలను రాబట్టడంలో నేర్పరి. తనకు అసైన్ చేసే ఏ కేసునైనా తన తెలివి తేటలతో క్లోజ్ చేస్తుంది. ఆమె చేతిలోకి ఓ కేసు ఫైల్ వెళ్లిందంటే నూటికి నూరు శాతం సాల్వ్ అవుతుందనే టాక్ డిపార్ట్ మెంట్ లో ఉంటుంది. రైటర్ అమరేందర్(నవీన్ చంద్ర)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే, పర్సనల్ లైఫ్ కంటే డ్యూటీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అదే సమయంలో హసీనా అనే మహిళ గృహహింసను ఎదుర్కొంటుంది. ఎలాగైనా తనకు సాయం చేయాలని సత్యభామను కోరుతుంది. విషయం తెలిసి హసీనాను ఆమె భర్త కిరాతకంగా చంపేస్తాడు. హసీనాతో పాటు ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేసిన ఆ దుర్మార్గుడిని పట్టుకునేటప్పుడు సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని దాటుకుని ఆమె ఈ కేసును ఎలా క్లోజ్ చేసింది? అనేది సినిమాలో చూపించారు.  

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

పెళ్లి తర్వాత కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్, గత ఏడాది సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. బాలయ్యతో కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ కొట్టడంతో మళ్లీ ఆమె ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు మంచు విష్ణు ‘కన్నప్ప‘ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 

Read Also: ముంబైలో మరో లగ్జరి అపార్ట్‌మెంట్‌ కొన్న ఆమీర్ ఖాన్ - దాని ధర ఎన్ని కోట్లో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Kotha Malupu : ఓటీటీలోకి సింగర్ సునీత కొడుకు కొత్త మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సింగర్ సునీత కొడుకు కొత్త మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Satluj OTT : రెండు రోజులకే ఓటీటీలో డిలీట్ - 'సట్లెజ్' మూవీ కాంట్రవర్సీ ఏంటి?... మళ్లీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రెండు రోజులకే ఓటీటీలో డిలీట్ - 'సట్లెజ్' మూవీ కాంట్రవర్సీ ఏంటి?... మళ్లీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Godavari Serial Today July 6th: 'గోదావరి' సీరియల్: ప్రేరణ తాళి తెంపేసిన ఈశ్వరి! ఆ పని చేసే మళ్లీ పెళ్లి చేసుకుంటామని సిద్ధూ, ప్రేరణ ఛాలెంజ్!
'గోదావరి' సీరియల్: ప్రేరణ తాళి తెంపేసిన ఈశ్వరి! ఆ పని చేసే మళ్లీ పెళ్లి చేసుకుంటామని సిద్ధూ, ప్రేరణ ఛాలెంజ్!
This Week OTT Movies : ఈ వారం ఓటీటీలో 18 మూవీస్ - రామ్ చరణ్ పెద్ది To సింగ్ గీతం... ఇవి వెరీ స్పెషల్
ఈ వారం ఓటీటీలో 18 మూవీస్ - రామ్ చరణ్ పెద్ది To సింగ్ గీతం... ఇవి వెరీ స్పెషల్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Embed widget