టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ శారీలో మెరిసిపోతూ కనిపించారు. కాజల్ అగర్వాల్ 2023లో ‘భగవంత్ కేసరి’తో విజయం అందుకున్నారు. 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో కాజల్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అదే సంవత్సరం వచ్చిన ‘చందమామ’తో కాజల్ స్టార్ అయిపోయారు. ఆ వెంటనే ‘మగధీర’, ‘ఆర్య 2’, ‘డార్లింగ్’, ‘బృందావనం’ సినిమాల్లో స్టార్ హీరోలతో జతకట్టింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న అందరు స్టార్ హీరోలతో కాజల్ నటించారు. 2021లో ‘లైవ్ టెలికాస్ట్’ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చారు. పెళ్లయ్యాక కూడా కాజల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక్కో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.