OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే
జూన్ మొదటి వారంలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఇవే. ఈ వీకెండ్‌ను ప్లాన్ చేసుకోండి మరి.
ఈ వారం కూడా ఓటీటీ, థియేటర్లలో చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సీరిస్‌లు రిలీజ్ కానున్నాయి. అలాగే, థియేటర్లలో పలు చిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూసేయండి మరి.
థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలివే
బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్’ - విడుదల తేదీ: జూన్ 2
బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 2న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. గణేష్ సరసన అవంతిక నటిస్తోంది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహతి స్వరసాగర్ ఈ మూవీకి సంగీతం అందించారు.
దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ - రిలీజ్ డేట్: జూన్ 2
ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తనయుడు, నటుడు రానా తమ్ముడు అభిరామ్ ‘అహింస’ మూవీతో ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూన్ 2న విడుదల కానుంది. ప్రేమ, యాక్షన్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీ తెరకెక్కింది. చాలా రోజుల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంగీతం ఇవ్వడం గమనార్హం. ఈ సినిమా ద్వారా పలువురు నూతన నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు.
దగ్గుబాటి రానా సమర్పణలో ‘పరేషాన్’ మూవీ
‘మసూదా’ మూవీతో మంచి హిట్ అందుకున్న తిరువీర్ ‘పరేషాన్’ మూవీతో వస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రూపక్ రోనాల్డ్ సన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
అజయ్ కీలక పాత్రలో ‘పద్మవ్యూహం’ - విడుదల తేదీ: జూన్ 2
నటుడు అజయ్ ప్రధాన పాత్రలో రూపొందించిన ‘చక్రవ్యూహం’ మూవీ జూన్ 2న విడుదల కానుంది. చెట్కూరి మధుసూదన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో ఇంకా జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది తదితరులు నటించారు.
కొత్త నటీనటులతో ‘ఐక్యూ’ - విడుదల తేదీ: జూన్ 2
కొత్త నటీనటులతో రూపొందించిన ‘ఐక్యూ’ మూవీ కూడా జూన్ 2న విడుదల కానుంది. శ్రీనివాస్ జీఎల్‌బీ తెరకెక్కించిన ఈ మూవీలో సాయిచరణ్, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సీరిస్‌లు ఇవే
Netflix
- ఫేక్ ఫ్రొఫైల్ (వెబ్ సీరిస్) - మే 31
- ఎ బ్యూటిఫుల్ లైఫ్ - (వెబ్ సీరిస్) - జూన్ 1
- న్యూ ఆమ్‌స్టర్ డామ్ - (వెబ్ సీరిస్) - జూన్ 1
- ఇన్ఫినిటీ స్ట్రామ్ - (మూవీ) - జూన్ 1
- ‘మ్యానిఫెస్ట్’ సీజన్-4 (పార్ట్ 2, వెబ్ సీరిస్) - వెబ్ సీరిస్ - జూన్ 2
- స్కూప్ - వెబ్ సీరిస్ (హిందీ) - జూన్ 2
Z5
- విశ్వక్ (తెలుగు) - మూవీ - జూన్ 2
Jio Cinema
- ‘అసుర్’ సీజన్-2 (హిందీ వెబ్ సీరిస్) - సీరిస్
Book My Show
- ఈవిల్ డెడ్ రైజ్ - మూవీ - జూన్ 1
Read Also: PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!