అన్వేషించండి

NTR30: ఎన్టీఆర్ సినిమా అప్డేట్ - నవంబర్‌లో లాంఛింగ్, డిసెంబర్‌లో షూటింగ్!

ఎన్టీఆర్30 సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) 'ఆర్ఆర్ఆర్'(RRR) తరువాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ(Koratala Siva), ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. ముందుగా కొరటాల శివ సినిమాను మొదలుపెట్టాల్సివుంది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్ ని మార్చుకున్నారు.

చాలా వరకు బరువు తగ్గారు ఎన్టీఆర్. ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ కుమార్ గైడన్స్ లో ట్రైనింగ్ తీసుకొని ఫిట్ గా తయారయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బరువు 75 కేజీలు. ఇప్పుడు ఆయన కొరటాల శివ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి కొరటాల స్క్రిప్ట్ లాక్ చేస్తే షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
NTR30 to launch in November: ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే.. నవంబర్ రెండో వారంలో సినిమాను ఫార్మల్ గా లాంచ్ చేసి.. డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. రాబోయే రోజుల్లో దీనిపై అధికార ప్రకటన రానుంది. ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య'తో డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కారణంగానే సినిమా ఆలస్యమవుతోంది. 
 
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. బాలీవుడ్ అమ్మాయిని తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ కి పనికొస్తుందని ఆలోచిస్తున్నారు. స్టార్ హీరోయిన్లతో పాటు మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లను కూడా పరిశీలిస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి..! 
 
విజయశాంతి ఓకే చెబుతుందా..? 
ఈ సినిమాలో పవర్ ఫుల్ మహిళ క్యారెక్టర్ ఒకటి ఉందట. దానికోసం ఒకప్పటి హీరోయిన్, టాలీవుడ్ తొలి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi)ని సంప్రదించినట్లు సమాచారం. ఆమెని కలిసి కొరటాల కథ వినిపించారట. అయితే దీనికి ఆమె ఒప్పుకుందా..? లేదా..? అనే విషయంలో క్లారిటీ రాలేదు.
 
చాలా ఏళ్లుగా విజయశాంతి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన పాత్ర నచ్చడం వలనే సినిమా చేశానని.. ఇకపై అలాంటి రోల్ వస్తుందనే నమ్మకం లేదని చెప్పారు. మరి ఆ రేంజ్ లో కొరటాల శివ.. విజయశాంతి కోసం క్యారెక్టర్ రాస్తే మాత్రం ఆమె నటించే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.
మరోపక్క ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు సానా ఎదురుచూస్తున్నారు. మరి ఆయనతో సినిమా ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి!
 

టాప్ హెడ్ లైన్స్

Maremma OTT : గ్రామ దేవతకు దున్నపోతును బలివ్వకపోతే? - రెండు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుడి మూవీ స్ట్రీమింగ్
గ్రామ దేవతకు దున్నపోతును బలివ్వకపోతే? - రెండు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుడి మూవీ స్ట్రీమింగ్
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 9: తండ్రిని చంపినందుకు విక్కీ చెంపపగులగొట్టిన రాధ..శీనయ్యను చంపి నేరం విక్కీమీద వేసిన దమయంతి
నువ్వులేక నేను లేను: తండ్రిని చంపినందుకు విక్కీ చెంపపగులగొట్టిన రాధ..శీనయ్యను చంపి నేరం విక్కీమీద వేసిన దమయంతి
Comrade Kalyan Review - 'కామ్రేడ్ కళ్యాణ్' రివ్యూ: శ్రీవిష్ణు నవ్వించారా? కథలో ఏముంది? సినిమా ఎలా ఉందంటే?
'కామ్రేడ్ కళ్యాణ్' రివ్యూ: శ్రీవిష్ణు నవ్వించారా? కథలో ఏముంది? సినిమా ఎలా ఉందంటే?
Vijay Deverakonda : 'జైలర్'కి పోదాం... 'రణబాలి'ఎందుకని రీల్స్ చేస్తున్నారు - నెగిటివ్ ట్రోలింగ్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
'జైలర్'కి పోదాం... 'రణబాలి'ఎందుకని రీల్స్ చేస్తున్నారు - నెగిటివ్ ట్రోలింగ్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Embed widget