అన్వేషించండి

Chiranjeevi: చిరు పేరులో మార్పు - సెంటిమెంట్ కాదు, మిస్టేక్ అట!

చిరంజీవి పేరులో ఎక్స్ట్రా గా ఓ లెటర్ వచ్చి చేరింది. అది న్యూమరాలజీ సెంటిమెంట్ అని అంతా అనుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాలు చేశారు. అందులో చాలా వరకు హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు రీఎంట్రీలో కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు ఈ సీనియర్ హీరో. ప్రస్తుతం ఈయన 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కిన 'లూసిఫర్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. 

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. అలానే చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి కారులో నుంచి దిగే సీన్ ఓ రేంజ్ లో ఉంది. అయితే ఈ వీడియోలో చిరంజీవి పేరులో ఎక్స్ట్రా గా ఓ లెటర్ వచ్చి చేరింది. సాధారణంగా మెగాస్టార్ పేరును 'CHIRANJEEVI' అని రాస్తారు. 'గాడ్ ఫాదర్' టీజర్‌లో మాత్రం 'CHIRANJEEEVI' అని ఉంది. ఒక 'E' ఎక్స్ట్రా యాడ్ అయింది. 

దీంతో చిరంజీవి న్యూమరాలజీ ప్రకారం తన పేరులో ఒక అక్షరాన్ని జత చేశారంటూ మాటలు వినిపించాయి. కానీ అభిమానులు మాత్రం ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో పేరు మార్చుకోని చిరు ఇప్పుడు ఎందుకు మార్చుకొని ఉంటారని సోషల్ మీడియా వేదికగా సందేహాలు వ్యక్తం చేశారు. బహుశా ఇది 'గాడ్ ఫాదర్' టీమ్ తప్పిదమై ఉంటుందని అనుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. చిరంజీవి ఎలాంటి న్యూమరాలజీను ఫాలో అవ్వడం లేదని.. పొరపాటున స్పెల్లింగ్ తప్పు పడిందని టాక్. 

ఇప్పుడు 'గాడ్ ఫాదర్' టీమ్ ఈ తప్పుని కరెక్ట్ చేయనుందని.. త్వరలోనే యూట్యూబ్ వీడియోలో చిరంజీవి పేరు పెర్ఫెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటివరకు అయితే వీడియోలో ఎలాంటి మార్పు లేదు. మరి చేంజ్ చేస్తారో లేదో చూడాలి! 

Also Read : కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Konidela Production Company (@konidelapro)

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - బ్లాక్ బస్టర్ ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: ఇళ్లంతా నవ్వులే నవ్వులు.. ఆ కంటెస్టెంట్స్ ఎక్కడ?
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: ఇళ్లంతా నవ్వులే నవ్వులు.. ఆ కంటెస్టెంట్స్ ఎక్కడ?
Tholubommalu Series OTT : ఓటీటీలోకి వచ్చేసిన జెన్ జీ యూత్ డ్రామా సిరీస్ తోలుబొమ్మలు - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన జెన్ జీ యూత్ డ్రామా సిరీస్ తోలుబొమ్మలు - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
Embed widget