అన్వేషించండి

18 Pages Trailer : నిఖిల్‌కు లెటర్ రాసిన అనుపమా - అరే, అసలు పేజ్ చింపేసిందే!

నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా '18 పేజెస్'. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.

నిఖిల్ సిద్దార్థ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం '18 పేజీస్' (18 Pages Movie). ఇందులో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. ఈ నెల 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మరి ట్రైలర్? త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిసెంబర్ 17న '18 పేజెస్' ట్రైలర్
18 Pages Trailer : నిఖిల్, అనుపమల ప్రేమ కహానీ ఎలా ఉండబోతుందనేది 18 కంటే ఒక్క రోజు ముందు ప్రేక్షకులకు చూపించనున్నారు. డిసెంబర్ 17న '18 పేజెస్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు. రెగ్యులర్‌గా ట్రైలర్ రిలీజ్ అని కాకుండా వినూత్నంగా వీడియో ద్వారా ట్రైలర్ విడుదల తేదీ వెల్లడించారు.
 
లెటర్ చింపేసిన అనుపమ
'18 పేజెస్' సినిమాలో అనుపమా పరమేశ్వరన్ లేఖలు రాసే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. నిఖిల్ ఏమో ఎప్పుడూ మొబైల్ చెక్ చేసుకునే అబ్బాయి రోల్ చేశారు. ట్రైలర్ రిలీజ్ 18న అని ఒక పేజీ మీద రాసుకుని నిఖిల్ దగ్గరకు అనుపమ తీసుకు వెళతారు. అనుపమను పట్టించుకోకుండా నిఖిల్ మొబైల్ మాయలో మునుగుతాడు. అప్పుడు ఆ పేజీని సగం చింపేసి ఆమె తీసుకు వెళుతుంది. అదీ కథ!

సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి జీఏ 2 పిక్చర్స్‌ పతాకంపై '18 పేజెస్' చిత్రాన్ని 'బన్నీ' వాస్ నిర్మించారు. సుకుమార్ అందించిన కథతో రూపొందిన చిత్రమిది. దీనికి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఆల్రెడీ సినిమాలో మూడు పాటలు విడుదల చేశారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన 'ఏడు రంగుల వాన...'ను ఈ మధ్య విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది. అంతకు ముందు శింబు పాడిన బ్రేకప్ సాంగ్ కూడా వైరల్ అయ్యింది. 

Also Read : 'జగమే మాయ' రివ్యూ : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ధన్యా బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?

మార్కెట్‌లోకి కొత్త బ్రేకప్ సాంగ్
'18 పేజెస్' చిత్రంలో 'టైమ్ ఇవ్వు పిల్లా టైమ్ ఇవ్వు' పాటను శింబు ఆలపించిన సంగతి తెలిసింది. ఈ సాంగ్ లిరికల్ వీడియో వింటే... బ్రేకప్ సాంగ్ అని ఈజీగా అర్థం అవుతోంది. అబ్బాయికి అమ్మాయి హ్యాండ్ ఇస్తే? కాన్సెప్ట్ బేస్ చేసుకుని రాసినట్టు ఉన్నారు. 

'కార్తికేయ 2' తర్వాత మరోసారి
'18 పేజెస్' సినిమాలో నిఖిల్ సరసన నిఖిల్, ఆమె నటించిన రెండో చిత్రమిది. తెలుగులో మాత్రమే కాదు... హిందీలో కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన 'కార్తికేయ 2' సినిమాలో నటించిన నిఖిల్, అనుపమ జంటగా నటించిన సంగతి తెలిసిందే. '18 పేజీస్'తో 'కార్తికేయ 2' సక్సెస్ ట్రాక్‌ను నిఖిల్, అనుపమ కంటిన్యూ చేయాలని కోరుకుందాం! వీళ్ళ హిట్ సెంటిమెంట్‌కు తోడు గీతా ఆర్ట్స్ సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. 'కాంతార' వంటి విజయవంతమైన సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. దాని తర్వాత వాళ్ళ నుంచి వస్తున్న చిత్రమిది. 'కుమారి 21 ఎఫ్' తర్వాత మరోసారి సూర్యప్రతాప్ పల్నాటి సినిమాకు సుకుమార్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. అదీ సంగతి!

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
Mahesh Babu: అన్నయ్య కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా? క్లారిటీ ఇచ్చిన అజయ్ భూపతి
అన్నయ్య కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా? క్లారిటీ ఇచ్చిన అజయ్ భూపతి
Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget