అన్వేషించండి

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రముఖు జ్యోతిష్యుడు వేణు స్వామితో రాజశ్యామల పూజలు చేయించారు... ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల జీవితాల్లో ఏం జరిగినా.. అది నేనే చెప్పాను.. నేను చెప్పినట్టే జరిగిందంటూ ముందుండే జ్యోతిష్యుడు వేణు స్వామి.. రీసెంట్ డేస్ లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పాపులర్ అయ్యాడు. సినీ నటుల జాతకాలు చెబుతూ.. ఎప్పుడూ వైరల్ అయ్యే ఈ స్వామి.. మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాడు. ముంబై మోడల్‌‌గా పనిచేసి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో హీరోయిన్ గా నటిస్తోన్న నిధి అగర్వాల్.. జ్యోతిష్యుడు వేణు స్వామితో రాజశ్యామల పూజ చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ కావడంతో ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. 

టాలీవుడ్ హీరో నాగ చైతన్య 'సవ్యసాచి' ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ నిధి అగర్వాల్..  అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఫస్ట్ సినిమానే ఆమెకు షాక్ కు గురి చేసింది. ఊహించినంత రేంజ్ లో ఈ సినిమా హిట్ కాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ 'మిస్టర్ మజ్నూ'లో నటించినా.. అదీ బెడిసికొట్టింది. అలా ఫ్లాప్ లతో సాగుతున్న ఆమె కెరీర్ లో ఓ బెస్ట్ ఛాన్స్ వచ్చింది. అదే 'ఇస్మార్ట్ శంకర్'. ఎలాగోలా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన భామ.. అనుకున్నట్టుగానే మూవీ భారీ సక్సెస్ అయింది. కానీ ఆ తర్వాత వచ్చిన హీరో కూడా ఫ్లాపే. దీంతో ఆమెకు మళ్లీ సినిమా కష్టాలు మొదలయ్యాయి.

సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో హిట్టులు రాకపోయినా... ముందు నుంచీ ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’లో కీలకమైన పాత్రను చేస్తోన్న నిధి.. మళ్లీ హిట్ కొడతానన్న ఆశతో ఉంది. ఇది తప్ప ఆమెకు ప్రస్తుతం ఎక్కడా అవకాశాలు లేనట్టు సమాచారం. దీంతో నిధి అగర్వాల్ కెరీర్ సందిగ్ధంలో పడిపోయింది. చేస్తున్న సినిమాలు హిట్ కావట్లేదు.. సినిమా అవకాశాలూ అంతంత మాత్రమే ఉండడంతో నిధి ఫ్యాన్స్.. మరింత డిసప్పాయింట్ లో ఉన్నారు.

ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో బిజీ షెడ్యూల్ లో గడిపిని నిధి అగర్వాల్.. ఈ మధ్య కాలంలో మాత్రం అంత పెద్దగా సినిమాలేం లేనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామితో ఇంట్లో పూజలు చేస్తూ కనిపించింది. రాజ శ్యామల పూజ, రాహు కేతు దోష నివారణ పూజలు చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఆఫర్లు తెచ్చుకోవడం, పెంచుకోవడం కోసమే ఈ పూజలంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో దోష నివారణ పూజలంటూ కామెంట్ చేస్తు్న్నారు.

ఇక సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన జోతిష్యుడు వేణు స్వామి కూడా రీసెంట్ డేస్ లో బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకుల గురించి ముందే చెప్పడంతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. దీంతో సెంటిమెంట్లను నమ్మే సినీ సెలెబ్రిటీలు ఆయనను తెగ ఫాలో అవుతున్నారు. ఇలా గతంలో నటి రష్మిక మందన్నా సైతం వేణు స్వామితో పూజలు చేయించింది. ఆ తర్వాతే ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా, నేషనల్ క్రష్‌గా మారిందంటూ ఆమె కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు.

Also Read : తండ్రి ఫోటోతో వారసుడు - తారకరత్న మరణం తర్వాత తొలిసారి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
Gopichand New Movie: ఫైట్ మాస్టర్‌కు గోపీచంద్ డైరెక్షన్ ఛాన్స్... సంకల్ప్ రెడ్డి తర్వాత సినిమాపై క్లారిటీ
ఫైట్ మాస్టర్‌కు గోపీచంద్ డైరెక్షన్ ఛాన్స్... సంకల్ప్ రెడ్డి తర్వాత సినిమాపై క్లారిటీ
Inka Em Anukoledhu: ఇంకా ఏం అనుకోలేదు... ఈటీవీ విన్‌తో వంశీ నందిపాటి కొత్త సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?
ఇంకా ఏం అనుకోలేదు... ఈటీవీ విన్‌తో వంశీ నందిపాటి కొత్త సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
Reliance Industries: దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
Tata Tiago Vs Maruti WagonR: టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
Embed widget