అన్వేషించండి

Urvashi Rautela: పిసరంత గాయానికే ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని చికిత్స - ఊర్వశీ.. ఇది కాస్త ఓవర్‌గా లేదు?

హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.. ఎందుకో తెలుసా?

Netizens Trolling On Urvashi Rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. స్పెషల్ సాంగ్స్ లో అందాలు ఆరబోస్తూ తెలుగు ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియోను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అమ్మడు అతిపై బోలెడు జోకులు వేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఊర్వశి రౌతేలాపై నెటిజన్ల ట్రోలింగ్

తాజాగా ఊర్వశి రౌతేలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని మరీ కనిపించింది. నిజానికి హాస్పిటల్లో చికిత్సపొందుతున్న వీడియోను సోషల్ మీడియాలో పెడితే, నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు. ఈమెను టార్గెట్ చేయడం ఏంటని అందరికీ ఆశ్చర్యం కలగకమానదు. కానీ, ఆమె హాస్పిటల్లో చేరింది పెద్ద ప్రాబ్లంతో కాదు. కేవలం, వేలికి చిన్న గాయం అయ్యింది. కాస్త రక్తం బయటకు వచ్చింది. అంతమాత్రం దానికే ఏకంగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ట్రీట్మెంట్ తీసుకోవడం, అదో గొప్పకార్యం అనేట్లుగా ఆ వీడియోను షేర్ చేయడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

“వేలుకు చిన్నగాయంతో హాస్పిటల్లో చేరిన తొలి మహిళగా గుర్తింపు పొందింది” అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “ఊర్వశీ.. ఊర్శశీ.. టేకిట్ ఈజీ ఊర్వశీ” అంటూ మరికొంత మంది కామెడీ చేస్తున్నారు. ‘ఓవర్ యాక్టింగ్ దుకాణం” అంటూ మరికొంత మంది ఎద్దేవా చేస్తున్నారు. ‘కాస్త పసుపు పూస్తే తగ్గిపోయే గాయానికి ఆక్సీజన్ మాస్క్ తగిలించుకుంది” అంటూ ఇంకొందరు కామెంట్స్ పెట్టారు. ఇక తాను కోలుకోవాలంటూ ప్రే చేయాలని నెటిజన్లను కోరడం పట్ల పలువురు ఫన్నీగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఊర్వశీ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తోంది. ట్రోలర్స్ కు మాంచి స్టఫ్ దొరకినట్లు అయ్యింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

తెలుగులో స్టార్ హీరోలతో ఆడిపాడిని ఊర్వశీ

నటి ఊర్వశీ రౌతేలా తెలుగులో పలు ఐటెమ్ సాంగ్స్ చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసింది. ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలో సంపత్ నంది ఓ ప్రాజెక్టును కూడా ప్లాన్ చేశారు. అయితే, ఇంత వరకు దాని గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. తెలుగు సినిమాల పట్ల ఆమెకు ఇష్టం ఉన్నా, అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు. హీరోయిన్ గా ఇక్కడ సరైన ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అక్కడ రాణిస్తోంది.

Also Read: ఆ హీరో నా లవ్ ను రిజెక్ట్ చేశాడు- ఫస్ట్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన ‘స్ట్రీ 2‘ బ్యూటీ

Also Read: ఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today September 27th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శారదకు షాక్‌ ఇచ్చిన మీరా – కేపీ చేత శారదకు బొట్టు పెట్టించిన మీరా
‘మేఘసందేశం’ సీరియల్‌: శారదకు షాక్‌ ఇచ్చిన మీరా – కేపీ చేత శారదకు బొట్టు పెట్టించిన మీరా
The Paradise Review : 'ది ప్యారడైజ్'పై కేటీఆర్ రివ్యూ - ఎమ్మెల్యే శంకరన్న రోల్ చూసి...
'ది ప్యారడైజ్'పై కేటీఆర్ రివ్యూ - ఎమ్మెల్యే శంకరన్న రోల్ చూసి...
Nindu Noorella Saavasam Serial Today September 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును మర్డర్‌ చేసేందకు వీరును రంగంలోకి దించిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును మర్డర్‌ చేసేందకు వీరును రంగంలోకి దించిన మనోహరి
Sunday OTT Movies : ఆదివారం ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ - వీకెండ్ వినోదాల పండుగే... ఇవి అస్సలు మిస్ కావొద్దు
ఆదివారం ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ - వీకెండ్ వినోదాల పండుగే... ఇవి అస్సలు మిస్ కావొద్దు

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
Embed widget