బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

తాజాగా తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన టిప్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది ఊర్వశి.

రోజూ యోగా చేయడం ఊర్వశికి అలవాటు. మనసును ప్రశాంతంగా ఉంచడానికి యోగా ఉపయోగపడుతుందని చెప్తోంది.

అనారోగ్య సమస్యలను దూరం చేయడం కోసం రోజూ 50 నిమిషాలు కార్డియో చేస్తుందట.

ఊర్వశికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్సింగ్ కూడా తన బాడీని ఫిట్‌గా ఉంచుతుందని అంటోంది.

ప్రతీ ఈవెంట్‌కు ముందు ఫిట్‌గా ఉండడం కోసం వెయిట్ ట్రైనింగ్ చేస్తుందట ఊర్వశి.

జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ పర్ఫెక్ట్ డైట్‌ను మెయింటేయిన్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటుందట ఊర్వశి రౌతెలా.

బరువును సరిగా మెయింటేయిన్ చేయడంలో హైడ్రేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఊర్వశి నమ్ముతుంది.

నోట్ : ఈ చిట్కాలు అవగాహన కోసం మాత్రమే.

All Images Credit: Urvashi Rautela/Instagram