అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లిలో సందడి చేసిన బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఆలియా భట్ కూడా ఒకరు.

ప్రీ వెడ్డింగ్ దగ్గర నుండి సంగీత్ వరకు అంబానీ ఫ్యామిలీ వెడ్డింగ్‌లో సందడి చేసింది ఆలియా.

తాజాగా వందేళ్ల నాటి చీర కట్టుకొని ఈ పెళ్లికి అటెండ్ అయ్యింది. దీంతో ఆ చీర గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

6 గ్రాముల బంగారం, 99 గ్రాముల వెండితో తయారు చేసిన చీరను ఆలియా కట్టుకుంది అని సమాచారం.

160 ఏళ్లనాటి చరిత్ర ఉన్న ఈ చీరను ఆశావళి శారీ అంటారని తెలుస్తోంది.

ఈ శారీపై ఆఫ్ షోల్డర్ గోల్డ్ కలర్ బ్లౌజ్, హెవీ జ్యువలరీతో అందంగా మెరిసింది ఆలియా భట్.

ఆలియా భట్, రణబీర్ కపూర్ కలిసి అంబానీ ఇంట జరిగిన దాదాపు ప్రతీ వేడుకకు హాజరయ్యారు.

ఫిబ్రవరీలో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆలియా, రణబీర్ డ్యాన్స్ కూడా చేశారు.

సంగీత్‌లో కూడా బ్లాక్ కలర్ లెహంగాలో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

All Images Credit: Alia Bhatt/Instagram