అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి జూలై 12న అనంత్-రాధికలు మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు హిల్దీ, మహెందీ, సంగీత్, మామేరు అంటూ జూలై 3 నుంచి ఒక్కో రోజు ఒక్కో వేడుక నిర్వహించారు అనంత్-రాధిక వివాహ వేడుకలకు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలంతా హాజరై సందడి చేస్తున్నారు ప్రతి ఈవెంట్‌లోనూ బాలీవుడ్ తారల హంగామే కనిపిస్తుంది తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అనన్య పాండే లెహెంగాలో తళుక్కున మెరిసింది అలాగే జాన్వీ కపూర్ బంజార స్టైల్ లెహెంగాలో ప్రత్యేక ఆకర్షణగా నిలించింది రణ్‌వీర్ సింగ్ వైట్ సల్వార్ కుర్తాలో మెరిశాడు మాజీ విశ్వసుందరి మానుషీ చిల్లర్ గోల్డ్ అండ్ సిల్వర్ చీరలో బుట్టబొమ్మలా ఆకట్టుకుంది డైరెక్టర్ అట్లీ తన భార్య ప్రియాంకతో కలిసి హాజరయ్యాడు ఎంఎస్ ధోని, భార్య సాక్షిలు కూడా వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు