అన్వేషించండి

ఆంటీ ఏంటీ? అమ్మ అనాలి - రాధికను అలా విష్ చేసినందుకు వరలక్ష్మి శరత్‌ కుమార్‌‌కు క్లాస్!

తమిళ ఫైర్ బ్రాండ్, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ మీద నెటిజన్లు మరోసారి మండిపడుతున్నారు.. రాధికను అమ్మా అనకుండా ఆంటీ అని ఎందుకు పిలుస్తున్నావంటూ క్లాస్ తీసుకుంటున్నారు..

వరలక్ష్మీ శరత్ కుమార్.. నిజానికి  ఈమె తమిళ నటి అయినా.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనలో తండ్రిని మించిన తనయగా వరలక్ష్మి పేరుతెచ్చుకుంది. తెలుగు, తమిళ పరిశ్రమలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. సినిమాల్లో మాదిరిగానే బయట కూడా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె మాట్లాడే మాటల్లో డొంకతిరుగుడు ఉండదు. ఏదైనా ఫేస్ టు ఫేస్. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అందుకే ఆమెను విమర్శించే వారికి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విమర్శకులకు వరలక్ష్మి ఇచ్చే కౌంటర్ కూడా అంతే పదునుగా ఉంటుంది. తాజాగా తమిళ సీనియర్ నటి రాధిక 60వ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పింది. “60వ జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ.. లవ్ యూ.. మీరు మా అందరికీ ఆదర్శం. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అనేదానికి మీరే ప్రూఫ్. హుమ్మ.. హ్యావ్ యే గుడ్ ట్రిప్ ఆంటీ.. సీ యూ సూన్” అని ట్వీట్ చేసింది.    

రాధికను.. ‘ఆంటీ’ అని సంబోధించడంతో నెటిజన్లు రెచ్చిపోయారు.. అమ్మను ఆంటీ ఆనడం ఏంటి? అంటూ క్లాస్ తీసుకుంటున్నారు. వరుసబెట్టి కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి రాధిక వరలక్ష్మికి పిన్ని అవుతుంది. కానీ, తనను ఆంటీ అని ఎందుకు పిలుస్తుందో గతంలోనే వివరణ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన తండ్రి శరత్‌ కుమార్ రెండో భార్య రాధిక గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. చాలా మంది రాధిక నా తల్లి అని అంటారని చెప్పింది. నిజానికి ఆమె తన తల్లి కాదని వెల్లడించింది. ఆమె కేవలం తన తండ్రికి రెండో భార్య మాత్రమే అన్నది. ఈ విషయంలో తామంతా సంతోషంగానే ఉన్నామని వెల్లడించింది.  బయటి వ్యక్తులే కావాల్సినన్ని పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడింది.

రాధికకు తనకు పడదని చాలా మంది అంటుంటారని.. అదంతా అవాస్తవం అని వెల్లడించింది. తమ ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉన్నట్లు చెప్పింది. నువ్వు అమ్మను.. ఆంటీ అని పిలుస్తావేంటి? అని ఎవరో ట్వీట్ చేశారు. నేను ఆంటీ అనే పిలుస్తాను అని చెప్పింది. రాధిక నాకు అమ్మకాన్నప్పుడు ఏమని పిలవాలి?  ఎవరికైనా ఒక్క అమ్మే ఉంటుంది. అందుకే రాధిక నాకు ఆంటీనే.  

తండ్రి శరత్ కుమార్ తో పాటు రాధికనూ అంతే గౌరవంగా చూస్తానని చెప్పింది. వాళ్లకు వ్యతిరేకంగా ఏమీ చేయను. కొంత మంది మొరిగే కుక్కల మాటలు అస్సలు పట్టించుకోనని గట్టి కౌంటర్ ఇచ్చింది.  వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళంతో పాటు పలు తెలుగు సినిమాలు చేసింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తండ్రి శరత్ కుమార్ సైతం పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. గ్యాంగ్ లీడర్  చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి అన్నయ్యగా.. బన్నీ సినిమాలో  అల్లు అర్జున్  తండ్రిగా నటించాడు. నటి రాధిక ను శరత్ కుమార్ రెండో వివాహం చేసుకున్నాడు.

Also Read: చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ సినిమాకు 5 భాషల్లో 5 వేర్వేరు క్లైమాక్సులు, ఇదిగో ఇలా మార్చేశారు

Also Read: చిరంజీవి బాలీవుడ్ చిత్రాలివే, ఆ సినిమా తర్వాత ఉత్తరాదికి ఎందుకు దూరమయ్యారు?

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వైల్డ్‌కార్డ్స్‌ చేతిలో నామినేషన్లు! శివ్‌ నిర్ణయం ఏంటి?
Lokesh Kanagaraj Allu Arjun : అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
Nindu Manasulu Serial Today October 12th: నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget