News
News
X

NBK Unstoppable NTR Jr : బాలయ్య బాబాయ్ షోకి అబ్బాయిలు ఎప్పుడొస్తారు? - నందమూరి ఫ్యాన్స్ డిమాండ్

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఓ టీవీ షో కోసం కలుస్తారని ఎవరైనా ఊహించారా? లేదు కదా! ఎన్‌బికె 'అన్‌స్టాపబుల్‌ 2'కు పవన్ వచ్చారు. మరి, నందమూరి యువ హీరోల సంగతి ఏంటి? ఎప్పుడు వస్తారు? ఇది ఫ్యాన్స్ డిమాండ్!

FOLLOW US: 
Share:

'అన్‌స్టాపబుల్‌ 2'... టాక్ షోకు ఎటువంటి స్పందన వస్తుందనేది ముందు ఊహించి పెట్టారో? లేదంటే బాలకృష్ణ టాక్ షో చేస్తే ఆ క్రేజ్, రెస్పాన్స్ వేరుగా ఉంటుందని అంచనా వేశారో? పేరుకు తగ్గట్టు నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్‌' ఏ విషయంలో 'స్టాప్' అనే పదానికి అర్థం తెలియదన్నట్లు ఈ షో దూసుకు వెళుతోంది.

సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇంటర్వ్యూలు ఇవ్వరు.  'అన్‌స్టాపబుల్‌ 2'కు ఆయన్ను తీసుకు వచ్చారు. పవన్ రావడం సమ్‌థింగ్‌ స్పెషల్ అయితే... ఆయనను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయడం మరో స్పెషల్! నందమూరి, మెగా అభిమానుల మధ్య చాలా ఏళ్లుగా సఖ్యత లేదు. ఇప్పుడు హీరోలు ఈ విధంగా కలవడం వల్ల సఖ్యత పెరుగుతుందని భావించవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే... 'అన్‌స్టాపబుల్‌ 2'కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు వస్తారు? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
 
బాబాయ్ షోకి అబ్బాయలు వచ్చేదెప్పుడు?
బాబాయ్ బాలకృష్ణతో అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్... ఈ ముగ్గురినీ ఒక్క వేదికపై చూడాలని అభిమానులు ఎప్పటికప్పుడు కోరుకుంటూ ఉంటారు. అతి తక్కువ సందర్భాల్లో ముగ్గురూ ఓ వేదికపై కనిపిస్తూ ఉంటారు. నందమూరి వంశం మూల పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ 'యన్.టి.ఆర్ - కథానాయకుడు' విడుదలకు ముందు జరిగిన ఆ  సినిమా వేడుకలో ముగ్గురూ సందడి చేసినట్లు ఉన్నారు. 

'అన్‌స్టాపబుల్‌ 2'కు తెలుగులో టాప్ స్టార్లు వచ్చారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ సందడి చేశారు. అయితే... నందమూరి అభిమానుల డిమాండ్ ఒక్కటే! ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ కూడా ఈ షోకి వచ్చి సందడి చేయాలని!

రెండో సీజన్‌లో కష్టమే!
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... 'అన్‌స్టాపబుల్‌ 2'కి అబ్బాయిలు ఇద్దరూ రావడం కష్టమని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వచ్చిన ఎపిసోడ్ రెండో సీజన్ ఫినాలే ఎపిసోడ్ అని ప్రచారం జరుగుతోంది. 'ఈ సీజన్ కాకపోతే వచ్చే సీజన్!' - ఇదీ నందమూరి అభిమానుల ఆశ. మూడో సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎపిసోడ్ అయితే బావుంటుంది. మరి, పాజిబుల్ అవుతుందో? లేదో? చూడాలి.
 
ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ పెద్ద బాలయ్యే కదా! 
నందమూరి హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులకు ఇంటి పెద్ద అంటే బాలయ్య బాబే అని అభిమానులు చెబుతున్నారు. అబ్బాయిలు ఇద్దరికీ బాబాయ్ అంటే ఎంతో గౌరవం. కళ్యాణ్ రామ్ బాబాయ్ కోసం 'బింబిసార' సినిమా స్పెషల్ షో వేశారు.

Also Read : పవన్ కళ్యాణ్ వెంట త్రివిక్రమ్ - 'అన్‌స్టాపబుల్‌ 2' ఎపిసోడ్‌లోనూ ఆయనే
 
అబ్బాయిలు ఇద్దరూ 'అన్‌స్టాపబుల్‌ 2'కి వస్తే... కుటుంబ విషయాలు బోలెడు తెలిసే అవకాశం ఉందని అభిమానుల ఆశ. అంతే కాదు... ఒక్క ఎపిసోడ్ ద్వారా నందమూరి నాయకుల మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవని సందేశం కూడా జనాల్లోకి వెళుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అది రాజకీయంగా లాభం చేకూర్చే అంశమే. ఏం జరుగుతుందో? లెట్స్ వెయిట్ అండ్ వాచ్! అభిమానులు అయితే తమ కోరికను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : మాస్ సినిమా చేస్తే 'కెజియఫ్' లాంటి సినిమా చేస్తా - ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

Published at : 27 Dec 2022 06:09 PM (IST) Tags: Nandamuri Kalyan Ram NTR Jr NBK Unstoppable 2 Balakrishna NTR Nandamuri Fans Demand

సంబంధిత కథనాలు

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

టాప్ స్టోరీస్

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి