అన్వేషించండి
Nayanthara: అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ కి నయన్ సర్‌ప్రైజ్, వీడియో వైరల్
ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార తన బాయ్ ఫ్రెండ్ కి సర్‌ప్రైజ్ ఇచ్చింది.

అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ కి నయన్ సర్‌ప్రైజ్
ప్రతి ఏడాది వాలెంటైన్స్ డేని ప్రేమికులంతా చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒకరికొకరు గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ.. కలిసి టైం స్పెండ్ చేస్తుంటారు. లవ్ లెటర్స్, టెడ్డి బేర్స్, కాస్ట్లీ గిఫ్ట్స్, హాలిడే ట్రిప్స్ ఇలా ఒక్కొక్కరూ ఒక్క విధంగా గిఫ్ట్ లు ఇస్తూ.. తమ లవ్ ను సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార తన బాయ్ ఫ్రెండ్ కి సర్‌ప్రైజ్ ఇచ్చింది.
అర్ధరాత్రి తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను కలిసి ఫ్లవర్ బొకేను అందించి అతడిని కౌగిలించుకుంది. వెంటనే విఘ్నేష్ ఆప్యాయంగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. 'తనొచ్చి ఫస్ట్ టైం ఫ్లవర్స్ ఇచ్చినట్లు ఇస్తే అది కచ్చితంగా వాలెంటైన్స్ డే' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు విఘ్నేష్ శివన్.
మరో పోస్ట్ లో 'అందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే. జీవితాన్ని పరిపూర్ణం చేసేది ప్రేమ మాత్రమే.. కాబట్టి ప్రేమించడానికైనా, ప్రేమను ఆస్వాదించడానికైనా టైం తీసుకోండి. ఆసక్తి చూపించండి' అని పేర్కొంటూ నయనతారతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion