అన్వేషించండి

'నారాయణ & కో' ట్రైలర్ - ఈ ఫ్యామిలీలో అందరూ తేడానే!

చిన పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న 'నారాయణ & కో' సినిమా ట్రైలర్ రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో... సుధాకర్ కోమాకుల తన ఫ్యామిలీతో చేసే కామెడీ.. ప్రేక్షకులను మరింత ఆకట్టుకోనుంది.

Narayana & Co Trailer Release : 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల ఇప్పుడు ‘నారాయణ & కో' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా పతాకాలపై పాపిశెట్టి బ్రదర్స్‌ సహకారంతో సుధాకర్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ గొర్రిపూడి ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిన పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

‘నారాయణ అండ్ కో’ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి

'ది తిక్కల్ ఫ్యామిలీ' ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ లో నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ చుట్టూ తిరిగే కథతో ఫన్‌ ఎలిమెంట్స్‌తో ఎంటర్‌టైనింగ్ గా తెరకెక్కించారు. మధ్య తరగతి కుటుంబాన్ని లీడ్‌ చేసే యజమాని నారాయణ పాత్రలో దేవీ ప్రసాద్ ప్రేక్షకులను అలరించనున్నారు. అతని భార్య పాత్రలో సీనియర్ నటి ఆమని నటించారు. ఈ సినిమా మెయిన్ గా దుబాయ్ నుంచి వచ్చిన పిల్లి బొమ్మ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది.

ఈ కుటుంబంలో పెద్ద కొడుకు సుధాకర్ క్రికెట్ బెట్టింగ్‌ లు చేస్తుంటాడు. చిన్న కొడుకు ఫొటోగ్రాఫర్. దేవీ ప్రసాద్ ఈ సినిమాలో బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగిగా కనిపించనున్నాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఫుల్ ఫన్‌తో వినోదాన్ని పంచుతుంది. "చైనా వాడు కల్తీ చేయనివంటివి ఉన్నాయంటే అవి చీరలు మాత్రమే"నని ఆమని చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. "న్యాయంగా సంపాదిస్తే డబ్బు నీడనిస్తుంది.. అన్యాయంగా సంపాదించాలని చూస్తే అంతు చూస్తుంది" అంటూ దేవీ ప్రసాద్ చెప్పే మాటలు కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. మొత్తానికి 'నారాయణ అండ్ కో' అఫిషియల్ ట్రైలర్.. వినోదభరితంగా, ఆసక్తిగా ఉందని చెప్పవచ్చు.

 

'నారాయణ అండ్ కో' చిత్రంలో పూజా కిరణ్‌, యామిని, జయ్‌కృష్ణ, సప్తగిరి, అలీరెజా, శివ, రాగిణి, అనంత్‌ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. 2021లో 'కార్తికేయ' టైటిల్ రోల్‌ పోషించిన రాజావిక్రమార్కలో కీలక పాత్రలో నటించాడు సుధాకర్‌ కోమాకుల. చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీతో నవ్వించేందుకు రెడీ అవుతున్నట్టు తాజా ట్రైలర్‌తో అర్థమవుతోంది. కాగా ఈ చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి, డాక్టర్‌ జోస్యభట్ల, నాగవంశి సంగీతం అందిస్తున్నారు.

Read Also : ‘ఆదిపురుష్’ చూసేందుకు ఏకంగా మల్డీప్లెక్స్‌నే బుక్ చేసిన కృతి సనన్ - ఎవరి కోసమో తెలుసా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి, వంశీని కాపాడటం కోసం పవర్స్ పోగొట్టుకున్న ముకేశ్! పసికందుని చూసి రోహిత్ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి, వంశీని కాపాడటం కోసం పవర్స్ పోగొట్టుకున్న ముకేశ్! పసికందుని చూసి రోహిత్ ఎమోషనల్!
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: ఎవరు ఏంటో మీరే తేల్చుకోండి! అదిరే గేమ్ పెట్టిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: ఎవరు ఏంటో మీరే తేల్చుకోండి! అదిరే గేమ్ పెట్టిన బిగ్‌బాస్!
Horror Thriller OTT : అడవిలో అర్ధరాత్రి భయపెట్టే మిస్టరీ ఏంటి? - ఆ ఓటీటీలోకి తమన్నా లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ
అడవిలో అర్ధరాత్రి భయపెట్టే మిస్టరీ ఏంటి? - ఆ ఓటీటీలోకి తమన్నా లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ
Netflix Top 10 Movies : నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ - ఇవి అస్సలు మిస్ కావొద్దు
నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ - ఇవి అస్సలు మిస్ కావొద్దు

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget