Nani Dasara Launch: నాని 'దసరా' మొదలైంది! కీర్తీ సురేష్‌తో మరోసారి
నేచురల్ స్టార్ నాని, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తీ సురేష్ మరోసారి జంటగా నటించనున్నారు. వీళ్ళిద్దరూ నటిస్తున్న తాజా సినిమా 'దసరా' నేడు మొదలైంది.
![Nani Dasara Launch: నాని 'దసరా' మొదలైంది! కీర్తీ సురేష్‌తో మరోసారి Nani Dasara movie Launched: Nani Keerthy Suresh starrer Rural MASS Entertainer Dasara launched with a Pooja Ceremony today Sukumar graced the Pooja ceremony Nani Dasara Launch: నాని 'దసరా' మొదలైంది! కీర్తీ సురేష్‌తో మరోసారి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/16/d4de5e007c75de0a21c3ad6e6367a5d6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నాని (Nani), కీర్తీ సురేష్ (keerthy Suresh) జంటగా నటిస్తున్న తాజా సినిమా 'దసరా' (Dasara Movie). దీనికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా (Dasara Movie Pooja Ceremony) మొదలైంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ (Nani Dasara Movie Regular Shoot From March, 2022) చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్, 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' దర్శకుడు తిరుమల కిషోర్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పక్కా తెలంగాణ భాష, యాసలతో... గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో 'దసరా' రూపొందుతోంది. గత ఏడాది దసరా సందర్భంగా సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. అందులో సినిమా నేపథ్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు. నాని, కీర్తీ సురేష్ లుక్స్‌తో పాటు ఆ కాలంలోని రైళ్లు, ఆ ట్రాక్, బతుకమ్మ పాటను చూపించారు. నాని, కీర్తీ సురేష్ ఇంతకు ముందు 'నేను లోకల్' చేశారు. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు. 'నేను లోకల్'తో కంపేర్ చేస్తే... ఇద్దరూ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు.
Also Read: యంగ్ హీరోలకు షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
సముద్రఖని, సాయి కుమార్, జరినా వాహబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్, నవీన్ నూలి ఎడిటర్. ఇంకా ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
Also Read: రాజమండ్రిలో ప్రజలకు రామ్ చరణ్ 15 ప్రొడక్షన్ హౌస్ స్వీట్ వార్నింగ్
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)