Father's Day 2023: ఫాదర్స్ డే సందర్భంగా తారకరత్నకు పిల్లల నివాళి, కంటతడి పెట్టిస్తున్న అలేఖ్య ఇన్ స్టా పోస్టు
ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి తారక రత్నకు ఘనంగా నివాళులర్పించారు ఆయన బిడ్డలు. అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

యువ కథానాయకుడు, రాజకీయ నేత నందమూరి తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరి 18న మరణించారు. తీవ్ర గుండె పోటుతో ఆస్పత్రిపాలైన ఆయన సుమారు 20 రోజులు మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయారు. ఆయన భార్య అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో తరుచుగా ఎమోషనల్ పోస్టులు పెడుతూ వస్తున్నారు. తారక రత్న మరణించి 6 నెలలు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు తన మనసులో ఇంకా సజీవంగా ఉన్నాయని ఆమె గుర్తు చేస్తున్నారు.
కంటతడి పెట్టిస్తున్న అలేఖ్య వీడియో
ఫాదర్స్ డే సందర్భంగా అలేఖ్య పోస్టు చేసిన వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇందులో తన బిడ్డలు నిషిక, తనయ్ రామ్, రెయా తండ్రికి పూలతో నివాళులర్పిస్తున్నారు. తారకరత్న ఫోటో ముందు పూలను పేర్చుతూ నమస్కరించారు. “పిల్లలు నిన్ను చాలా మిస్ అవుతున్నారు నాన్నా, వారి బాధ ముందు నా బాధ చాలా తక్కువ. మన పిల్లల దృష్టిలో అత్యుత్తమ తండ్రిగా ఉన్న నీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. వియ్ లవ్ యు ఓబు(తారకరత్న ముద్దుపేరు)” అని అలేఖ్య రాసుకొచ్చారు.
View this post on Instagram
తారక రత్న ఫిబ్రవరి 18న మరణించారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న అలేఖ్యా రెడ్డి, ఆ తర్వాత నుంచి తరచూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. హిందూపురంలో నిర్మించిన ఆస్పత్రిలో తారక రత్న పేరు మీద ఓ బ్లాక్ ఓపెన్ చేయడంతో ఆయనది బంగారు మనసు అని చెప్పారు అలేఖ్య. దానికి కొన్ని రోజుల ముందు తమ దంపతులపై వివక్ష చూపించారని పేర్కొన్నారు.
పెళ్లి తర్వాత వివక్ష
తారక రత్న, తాను పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి తమకు కష్టాలు మొదలు అయ్యాయని అలేఖ్యా రెడ్డి పేర్కొన్నారు. తమపై వివక్ష చూపించారని, అయినా తాము బతికామని, సంతోషంగా ఉన్నామని ఆమె వివరించారు. పెద్దమ్మాయి నిష్కమ్మ జన్మించిన తర్వాత తమ ఆనందం రెట్టింపు అయ్యిందని తెలిపారు. అయితే, ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. 2019లో కవలలు జన్మించడం తమకు సర్‌ప్రైజ్ అన్నారు. తారక రత్న ఎప్పుడూ పెద్ద కుటుంబం కావాలని కోరుకునే వారని, ఇప్పుడు తనను మిస్ అవుతున్నామని అలేఖ్యా రెడ్డి తెలిపారు.
గుండెల్లో బాధను ఎవరూ చూడలేదు!
తమ పెళ్లి నుంచి తారక రత్న మరణం వరకు తాము ఇబ్బందులు పడ్డామనేది నిజమని అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేశారు. ''నువ్వు గుండెల్లో మోసిన బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎవరూ ఆ బాధను చూడలేదు. కష్టాల్లో నేను నీకు సాయం చేయలేకపోయా. మన ప్రయాణం మొదలైన తరుణం నుంచి చివరకు వరకు... మనకు అండగా ఉన్న వ్యక్తులు మాత్రమే మనతో ఉన్నారు. నువ్వే మా రియల్ హీరో ఓబు. కుటుంబంగా నిన్ను చూసి మేం గర్విస్తున్నాం. ప్రశాంతత, సంతోషం ఉన్న చోటు మళ్ళీ మనం కలుద్దాం'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తారక రత్న మరణం నుంచి అలేఖ్యా రెడ్డి ఈ విధమైన సెన్సేషనల్ పోస్టులు చేస్తున్నారు.
Read Also: చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్‌కు అన్నయ్య నేనే! ఆయనతో ఎలాంటి గొడవలు లేవు: కమెడియన్ సుధాకర్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

