News
News
X

Unstoppable - 2: ఫస్ట్ నా సినిమా, ఆ తర్వాతే మీ నాన్నగారిది - రామ్ చరణ్‌తో బాలకృష్ణ

బాలయ్య ‘అన్‌స్టాపబుల్-2’ షో నుంచి మరో ప్రోమో వచ్చేసింది. ఇందులో బాలయ్య.. రామ్ చరణ్‌తో మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి తన మూవీనే ఫస్ట్ చూడాలని కోరడం విశేషం.

FOLLOW US: 
Share:

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ షోలో ఈ వారం హీరోలు ప్రభాస్, గోపీచంద్‌లు పాల్గొన్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి ‘ఆహా’ ఓటీటీ మరో ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో బాలయ్య, ప్రభాస్, గోపీచంద్‌ల సరదా సంభాషణలు, చమత్కారాలను చూపించారు. 

బాలయ్య మాట్లాడుతూ.. ‘‘నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతులుగా మారిపోతారు. నేను నీ మాయలో పడిపోయాను’’ అని అన్నారు. ఆ తర్వాత.. ‘‘ఏంటీ పెళ్లి ఉందా? లేదా? అసలు?’’ అని అడిగారు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘రాసిపెట్టి లేదు సార్’’ అని అన్నారు. దీంతో బాలయ్య ‘‘మీ అమ్మకు చెప్పిన మాటలు చెప్పకయ్యా’’ అని అన్నారు. నిన్ను ఎక్కువగా నీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారని బాలయ్య అడిగితే.. ‘‘డార్లింగ్’’ అనే పిలుస్తారని ప్రభాస్ సమాధానమిచ్చారు. మరి ‘‘గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు?’’ అని అనే ప్రశ్నకు మాత్రం ప్రభాస్ తెలివిగా.. ‘‘అదేదో టాబ్లెట్ వేసుకుంటున్నా సార్, మరిచిపోతున్నా ఈ మధ్యన’’ అని బదులిచ్చారు. 

‘‘2008లో ఏదో హీరోయిన్ విషయంలో గొడవపడ్డారు’’ అని బాలయ్య అడిగితే.. గోపీచంద్ ‘‘2008 కాదు సార్ అది’’ అని చెబుతుంటే.. ప్రభాస్ ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. షోలో భాగంగా బాలకృష్ణ.. హీరో రామ్ చరణ్‌కు ఫోన్ చేశారు. ‘‘సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు, తర్వాత మీ నాన్నగారి సినిమాకు వెళ్లు’’ అని అనడంతో ప్రోమో ముగిసింది. ఈ సంక్రాంతి పండుగకు చిరంజీవి, బాలకృష్ణ నటించిన సినిమాలు ఒకేసారి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న, ‘వీరసింహా రెడ్డి’ జనవరి 12న విడుదల కానున్నాయి.

View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

‘అన్‌స్టాపబుల్-2’ షోలో ప్రభాస్, గోపీ చంద్‌ల ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. మొదటి భాగాన్ని డిసెంబరు 30న, రెండో భాగాన్ని జనవరి 6న స్ట్రీమింగ్ చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ప్రభాస్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు గురూజీ వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా ఆ ఎపిసోడ్ విడుదల కానుందని సమాచారం. ఆహా వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

Also Read: మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?

Published at : 28 Dec 2022 09:53 PM (IST) Tags: Balakrishna Gopi Chand Prabhas Ram Charan Unstoppable 2

సంబంధిత కథనాలు

రాతిలోని శిల్పాన్ని గుర్తించగల మహా శిల్పి విశ్వనాథ్ - ఆయన సినిమాల్లో ఈ విషయాలను గుర్తించారా?

రాతిలోని శిల్పాన్ని గుర్తించగల మహా శిల్పి విశ్వనాథ్ - ఆయన సినిమాల్లో ఈ విషయాలను గుర్తించారా?

K Viswanath : విశ్వనాథ్ సినిమాల్లోనే కమల్ హాసన్, చిరంజీవి నట విశ్వరూపం చూపించారెందుకు?

K Viswanath : విశ్వనాథ్ సినిమాల్లోనే కమల్ హాసన్, చిరంజీవి నట విశ్వరూపం చూపించారెందుకు?

K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!

K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే  'నిజం విత్ స్మిత' మొదలు

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

టాప్ స్టోరీస్

ADR Report : దేశంలో 239 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, 486 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు - ఏడీఆర్ రిపోర్టులో సంచలనాలు

ADR Report : దేశంలో 239 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, 486 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు - ఏడీఆర్ రిపోర్టులో సంచలనాలు

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?