అన్వేషించండి

Phalana Abhayi Phalana Ammayi Teaser: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్: బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు?

నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీ టీజర్ వచ్చేసింది. చూస్తుంటే.. ఈ మూవీ యూత్‌ మనసు దోచేలాగే కనిపిస్తోంది.

నటుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. గురువారం చిత్రయూనిట్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌పై మీరూ ఓ లుక్ వేసేయండి మరి. 

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్:

టీజర్ ఎలా ఉంది?

టీజర్ మొత్తంలో నాగశౌర్య, మాళవిక నాయర్, అవసరాల శ్రీనివాస్ మాత్రమే కనిపించారు. ‘‘ఇందుమూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయనది ఏమనగా.. సంజయ్ పీచపాటి మరియు అనుపమా కస్తూరీ బెస్ట్ ఫ్రెండ్స్ అహో’’ అంటూ మాళవిక నాయర్ వాయిస్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఫ్రెండ్స్‌గా క్లోజ్‌గా ఉండటం, ‘‘పాత్రకు అవసరమైతే ఎక్స్‌పోజింగ్ కూడా చేస్తా’’ అని నాగశౌర్య అనడం, ‘‘పెళ్లయిన తర్వాత కూడా నటిస్తా’’ అంటూ మాళవిక చెప్పడం.. వంటి సరదా సీన్స్ నవ్విస్తాయి. అయితే, ‘‘నాకు, అనుకు మధ్య అలాంటిది ఏమీ లేదు’’ అని నాగశౌర్య చెప్పడం, కట్ చేస్తే.. వారిద్దరు ముద్దుపెట్టుకోనే సీన్ షాకిస్తుంది. ఆ తర్వాత నాగశౌర్య ‘‘ఉయ్ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్’’ అని క్లారిటీ ఇవ్వడం, చివరి సీన్లో ‘‘నా దగ్గర పాతవేవీ లేవు. అన్నీ డిస్పోజ’’ అని చెప్పడంతో టీజర్ ముగిసింది. ఈ టీజర్ ప్రకారం.. యంగ్ ఏజ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నవారు అనివార్య కారణాలతో విడిపోవడం.. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న వారిద్దరి జీవితాలు ఎలా మలుపుతిరుగుతాయనేదే కథ అని తెలుస్తోంది. 

నాగశౌర్యకు సరైన హిట్ దొరికి చాలా రోజులవుతోంది. శౌర్య కెరీర్‌లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘చలో’, ‘జో అచ్చుతానంద’, ‘హే బేబీ’ వంటి సినిమాలు మాత్రమే మంచి ఫలితాలిచ్చాయి. గత కొన్నాళ్లుగా శౌర్య సినిమాలైతే వస్తున్నాయి కానీ, పాజిటివ్ టాక్ సొంతం చేసుకోలేకపోతున్నాయి. గతేడాది విడుదలైన ‘కృష్ణ వ్రిందా విహారి’ కూడా నిరాశే మిగిల్చింది. ఈ నేపథ్యంలో నాగశౌర్య.. మరోసారి ‘ఊహలు గుసగుసలాడే’ దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్‌తో జత కట్టాడు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టీజర్ చూస్తుంటే.. యూత్‌ను ఆకట్టుకొనే విధంగానే ఉంది. అయితే, ఇది కూడా ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య జరిగే లవ్ డ్రామానా లేదా? ఇద్దరు అపరిచితుల మధ్య ఏర్పడే బాండ్.. స్నేహం.. ప్రేమ.. విరహంగా రూపాంతరం చెందుతూ, చివరికి హీరోయిన్ మరొకరి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. ఆమెపై ప్రేమతో హీరో ఆ పెళ్లిలోనే తన ప్రేమను వ్యక్తం చేయడం వంటి రొటిన్ ఫార్ములాతో సాగుతుందా అనేది తెరపైనే చూడాలి. అయితే, శ్రీనివాస్ అవసరాల కథలో కాస్త కొత్తదనం ఉంటుంది. ఆ నమ్మకమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం ఉందనిపిస్తోంది. ఏది ఏమైనా నాగశౌర్య ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడని ఆశిద్దాం. 

ఈ సినిమా ప్రారంభంలో చాలా అవాంతరాలు వచ్చాయి. కరోనా వల్ల షూటింగ్ కూడా జరగలేదు. దర్శకనిర్మాతల నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో ఈ మూవీ పూర్తిగా ఆగిపోయిందని భావించారు. తాజాగా మేకర్స్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేయడంతో నాగశౌర్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం విడుదలైన టీజర్ కూడా యూత్‌ను ఆకట్టుకుంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో చాలా భాగం అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానందా’ వంటి హిట్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబోలో వస్తున్న మూడో చిత్రం ఇది. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు కూడా పెరిగాయి. ఈ మూవీకి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. 

Also Read: 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget