News
News
X

ఇళయరాజాను కలసిన నాగ చైతన్య, ఇది మరచిపోలేని రోజంటూ ఎమోషనల్ పోస్ట్

మ్యూజికల్‌ మ్యాస్ట్రో ఇళయరాజాని హీరో నాగచైతన్య కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్‌ పోస్ట్ షేర్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది ‘బంగార్రాజు’, ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చడ్డా’ వంటి సినిమాలతో అలరించారు చై. ఈ ఏడాది ‘కస్టడీ’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మూవీకు తమిళ్ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి సారిగా నాగ చైతన్య కెరీర్ లో తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాను చిత్రీకరించారు. ఇప్పటికే ఈ మూవీకు సంబంధించి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో నాగ చైతన్య పోలీస్ అధికారి పాత్రలో కనిపించానున్నారు. ఈ మూవీకు ప్రత్యేకంగా ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ఒకరు మాస్ట్రో ఇళయరాజా కాగా, మరొకరు యువన్ శంకర్ రాజా. ఇక ఈ మూవీలో మ్యూజికల్ కంపొజిషన్స్ పై ఇటీవల నాగచైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం చై చేసిన పోస్ట్ నెట్టంట వైరల్ అవుతోంది. 

సాధారణంగా ఇళయరాజా సంగీతానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీంతం అందించారు. సౌత్ సినిమాలకు ఆయన బ్యాక్ బోన్ లా ఉండేవారు. కేవలం ఆయన సంగీతం వల్లే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇక హీరో నాగ చైతన్య కూడా ఇళరాజా సంగీతానికి పెద్ద ఫ్యాన్. ఆయన సంగీతమంటే చై కు ఎంతో ఇష్టం. సినిమాల మీద ఆసక్తి రావడానికి ఇళయరాజా సంగీతం కూడా ఒక కారణమట. ప్రస్తుతం ఆయన సినిమాకు ఇళయరాజా సంగీతం అందించడంతో నాగ చైతన్య ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇటీవలే ఆయన మాస్ట్రో ఇళయరాజాను కలిశారు. హైదరాబాద్‌కి వచ్చిన మ్యాస్ట్రోని ఆయన ప్రత్యేకంగా కలిసి తన ఫ్యాన్‌ బాయ్‌ మూవ్‌మెంట్‌ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా చై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ ఎమోషనల్‌ నోట్‌ ను ట్విట్టర్‌ వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు.  

ట్విట్టర్ లో నాగ చైతన్య ఇలా రాసుకొచ్చారు.. ‘‘ఈ రోజు మ్యాస్ట్రో ఇళయరాజా సార్ ను  కలిసిన వెంటనే నా ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. నా జీవితంలో చాలా సందర్భాల్లో ఆయన సంగీతాన్ని వింటూ సీన్స్ ను ఊహించుకుంటూ ఉండేవాడిని. అంతగా ఆయన సంగీతం నా జీవితంలో ఎన్నో ప్రయాణాల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆయన మా ‘కస్టడీ’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా ఇళయరాజా సర్ కి కృతజ్ఞతలు చెప్తున్నాను’’ రాసుకొచ్చారు. అంతేకాదు. ఆయనతో కలసి దిగిన ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఇక ‘కస్టడీ’ మూవీలో నాగ చైతన్య చాలా కొత్తగా కనిపించనున్నారు. వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో నాగచైతన్య సరసన కృతిశెట్టి మరోసారి జంటగా నటించనుంది. ఈ సినిమాను వేసవి కానుకగా మే 12 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Read Also: హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే బెస్ట్ - నసీరుద్దీన్ షా సెన్సేషనల్ కామెంట్స్!

Published at : 26 Feb 2023 03:22 PM (IST) Tags: Naga Chaitanya Maestro Ilaiyaraaja Ilaiyaraaja Custody

సంబంధిత కథనాలు

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో

Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో

Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శ‌కున‌ములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్

Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శ‌కున‌ములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్

Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక

Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక

Manisha Koirala: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు

Manisha Koirala: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?