Telugu Indian Idol - Thaman: తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జ్‌గా తమన్ - హోస్ట్‌గా శ్రీరామచంద్ర
సూపర్ డూపర్ సక్సెస్ సాంగ్స్, సినిమాలతో దూసుకువెళుతున్న తమన్ త్వరలో ఓటీటీ తెరపై సందడి చేయనున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ షోకు ఆయన జడ్జ్‌గా వ్యవహరించనున్నారు.

సంగీత దర్శకుడు తమన్ చాలా బిజీ. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో పాటు పలువురు యంగ్ హీరోల చిత్రాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు. ఇంత బిజీలోనూ ఆయన యంగ్ టాలెంటెడ్ సింగర్స్‌ను ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్న చేస్తున్న సింగింగ్ షోకు జడ్జ్‌గా వ్యవహరించడానికి ఆయన అంగీకరించారు.
దేశవ్యాప్తంగా పాపులర్ అయిన 'ఇండియన్ ఐడల్' షో గురించి తెలిసిందే. ఆ షోకు తెలుగు వెర్షన్ చేస్తున్నట్టు 'ఆహా' ఓటీటీ ప్రకటించింది. దానికి తమన్ జడ్జి అన్నమాట. హిందీలో పన్నెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఇండియన్ ఐడల్ షో ఇప్పటి వరకు తెలుగులోకి రాలేదు. తెలుగు సింగింగ్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
'తెలుగు ఇండియన్ ఐడల్'కు తమన్ జడ్జ్ కాగా... శ్రీరామచంద్ర హోస్ట్ / యాంకర్. త్వరలో ఈ షో ప్రారంభం కానుంది. గతంలో శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒక సీజన్ లో రేవంత్ విజేతగా నిలిచారు.
Also Read: రాజమండ్రిలో ప్రజలకు రామ్ చరణ్ 15 ప్రొడక్షన్ హౌస్ స్వీట్ వార్నింగ్
Also Read: యంగ్ హీరోలకు షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















