అన్వేషించండి

Mouni Roy: హాస్పిటల్ బెడ్‌పై కదల్లేని స్థితిలో మౌనీ రాయ్ - ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీకి ఏమైంది?

‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన మౌనీ రాయ్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోంది. తొమ్మిది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆమె రీసెంట్ గా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

Mouni Roy: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పలు సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘నాగిన్’ అనే సీరియల్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత  సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. గతేడాది వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కూడా ప్రధాన విలన్ పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవల ఈ బ్యూటీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌనీకు ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు.

ఆసుపత్రిలో మౌనీ రాయ్..

సినిమా తారల వ్యక్తిగత విషయాలు వారి అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. వారికి సంబంధించిన విషయాలు బయటకు వస్తే ఎక్కువగానే రియాక్ట్ అవుతారు ఫ్యాన్స్. తాజాగా మౌనీ రాయ్ కు సంబంధించిన ఓ వార్త ఒకటి బయటకు రావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. అందులో మౌనీ రాయ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు ఉంది. దానితో పాటు డిస్చార్జి అయి ఇంటికి వెళ్తున్నట్టు కూడా ఓ ఫోటోను షేర్ చేసింది. అలాగే ఆసుపత్రిలో గడిపిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. దానికి తోడు ఒక స్పెషల్ నోట్ ను కూడా రాసుకొచ్చింది మౌనీ. 

తొమ్మిది రోజులు బెడ్ మీదే మౌనీ.. 

తన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలిపిన మౌనీ తన నోట్ లో ఇలా రాసుకొచ్చింది. “9 రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. ఎప్పుడూ ఇలా నిశ్చలంగా ఉండలేదు. అయితే ఇప్పుడు నేను కోలుకున్నాను. తిరిగి ఇంటికి వచ్చాను. నెమ్మదిగా కోలుకుంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుటపడుతోంది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్న వైద్యులు అక్కడి మెడికల్ స్టాఫ్ అలాగే నా సన్నిహితులకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా భర్త నంబియార్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆయన లాంటి వారు ఎవరూ ఉండరు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’’ అంటూ రాసుకొచ్చింది.

మౌనీ రాయ్ గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమెను కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తొమ్మిది రోజుల ట్రీట్మెంట్ అనంతరం ఆమె తిరిగి ఇంటికి వచ్చినట్టు పేర్కొంది. దీంతో ఆమె అభిమానుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మౌనీ రాయ్ కు వచ్చిన ఆ సమస్య ఏమిటీ అనేది మాత్రం బయటకు చెప్పలేదు. దీంతో దీనిపై ఆరా తీస్తున్నారు పలువురు నెటిజన్లు. మరి దీనిపై మౌనీ రాయ్ గానీ లేదా అమె కుటుంబ సభ్యులు గానీ ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి మౌనీ తన ఇంట్లో పూర్తి విశ్రాంతిలో ఉన్నట్టు సమాచారం. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mon (@imouniroy)

Also Read: మగాడివైతే 'మణిపూర్ ఫైల్స్' సినిమా తీయాలన్న నెటిజన్ - కౌంటర్ ఎటాక్ చేసిన 'కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pathala Bhairavi: పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
Bangaru Bomma Song Lyrics: బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
Telugu TV Movies Today: ఈ శనివారం (మార్చి 14) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
ఈ శనివారం (మార్చి 14) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
Pathala Bhairavi: పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
Amavasya 2026: మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
Bangaru Bomma Song Lyrics: బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Embed widget