Lakshmi Manchu: మోహన్ బాబుతో మంచు లక్ష్మీ సినిమా - టైటిల్ ఏంటంటే?
మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఓ సినిమా చేయబోతుంది.

మంచు లక్ష్మీ(Manchu Lakshmi) నటిగా ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించింది. హోస్ట్ గా కొన్ని షోలు చేసింది. అయితే ఇప్పుడొక సినిమా అనౌన్స్ చేసింది ఈమె. దానికి 'అగ్ని నక్షత్రం'(Agni Nakshatram) అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. టైటిల్ తో పాటు చిన్న టీజర్ కూడా వదిలింది. అంతేకాదు.. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు(Mohan Babu) కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పింది.
తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలిపింది. తన కల నిజమైందని.. నాన్నతో కలిసి తెలుగు సినిమాలో నటిస్తున్నానని చెప్పింది. అలానే సినిమాను నిర్మించబోతున్నట్లు.. చాలా ఎగ్జైటెడ్ గా ఉందని చెప్పింది. ఈ సినిమాకి ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు లక్ష్మీ, మోహన్ బాబు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి లిజో కె జొస్ సంగీతం అందిస్తున్నారు. గోకుల్ భర్త సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. టీజర్ లో పోలీస్ జీప్ ఒకటి హారన్ మోగిస్తూ వెళ్లడం చూపించారు. ఈ టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.
Also Read: మాది 'పవిత్ర' బంధం, మేం మంచి స్నేహితులం - రూమర్స్‌పై నరేష్ స్పందన
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
View this post on Instagram
Before You Go
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















