అన్వేషించండి

Michael Teaser: వెంటాడి ఆకలిని తీర్చుకోవడానికి, వేటాడ్డం తెలియాల్సిన పని లేదు: సందీప్ కిషన్ ‘మైఖెల్’ టీజర్ అదుర్స్!

సందీప్ కిషన్ నటించిన ‘మైఖెల్’ మూవీ వచ్చేసింది. ఈ సినిమా కోసం ఎంతో సన్నబడ్డ.. సందీప్ కొత్త లుక్‌లో ఎలా ఉన్నాడో చూసేయండి.

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ను నమ్ముకొని పైకొచ్చిన యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. వరుసగా సినిమాలు చేస్తున్నా అడపాదడపా సినిమాలు మాత్రమే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంటున్నాయి తప్ప బ్లాక్ బస్టర్ లు రావట్లేదు. ఇండస్ట్రీలో ఇప్పటికీ బ్లాక్ బస్టర్ రాని యువ హీరోలు చాలామందే ఉన్నారు. వారిలో  సందీప్ కిషన్ ఒకరు. ఇంతకు ముందు రిలీజ్ అయిన సందీప్ కిషన్ సినిమాలు కూడా అంతంత మాత్రం గానే ఆడాయి. అందుకే ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు సందీప్. ఈ మధ్య ఎక్కువ మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సందీప్ కూడా పాన్ ఇండియా వైపే అడుగులు వేస్తున్నాడు. 'మైఖేల్' సినిమాను దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు గురువారం టీజర్ విడుదల చేశారు. 

తెలుగులో న్యాచురల్ స్టార్ నాని, తమిళ్ లో హీరో ధనుష్, కన్నడలో రక్షిత్ శెట్టి ఇలా ఒక్కో భాషలో ఒక్కో హీరో టీజర్ ను విడుదల చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీజర్ లో సందీప్ కిషన్ లుక్స్ అదిరిపోయాయి. సందీప్ కిషన్ ను మునుపెన్నడూ చూడని విధంగా ఈ టీజర్ లో చూస్తారు ఆడియన్స్. టీజర్ లో సందీప్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు. టీజర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో సాగే కథలా అనిపిస్తుంది. విజువల్స్ లో కూడా ఓ కొత్తదనం కనబడుతోంది. డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదిరిపోయాయి. టీజర్ మధ్యలో వచ్చిన డైలాగ్ ఓ రేంజ్ లో ఉంది. ‘‘మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్’’ అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. దానికి హీరో బదులు చెప్తూ.. "వెంటాడి ఆకలి తీర్చుకోడానికి.. వేటాడటం తెలియల్సిన పనిలేదు మాస్టార్" అని అంటాడు.  అలాగే టీజర్ చివరలో ‘‘మన్నించేటప్పుడు మనం దేవుడవుతాం మైఖేల్’’ అనే డైలాగ్ కు కూడా హీరో బదులిస్తూ  "నేను మనిషిగానే ఉంటా మాస్టార్" అని అంటాడు. ఈ డైలాగ్స్ సినిమా పై మరింత ఆసక్తి పెంచేలా ఉన్నాయి.

Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!

ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కరణ్ సీ ప్రొడక్షన్ల్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ క్రైమ్, త్రిల్లర్ జోనర్ లో తమిళ్ యాక్టర్ విజయ్ సేతుపతి, గౌతమ్ మేనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్  లాంటి సీనియర్ నటీనటులు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. శామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో వస్తోన్న ఈ సినిమా సందీప్ కిషన్ కు మంచి హిట్ ను అందిస్తుందో లేదో వేచి చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Balan The Boy: తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని లక్ష్మీ చూసిందా! సిరి తండ్రికి తెలీకుండా ఆ పని చేయగలదా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని లక్ష్మీ చూసిందా! సిరి తండ్రికి తెలీకుండా ఆ పని చేయగలదా!
Salim Kumar: విషమంగా నేషనల్ అవార్డు విన్నర్ ఆరోగ్య పరిస్థితి... ఆస్పత్రిలో సలీం కుమార్
విషమంగా నేషనల్ అవార్డు విన్నర్ ఆరోగ్య పరిస్థితి... ఆస్పత్రిలో సలీం కుమార్
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget